ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాజయం

ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాజయం

మొహాలీ: మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా పరాజయం పాలయ్యింది. భారత్ నిర్దేశించిన 209 భారీ లక్ష్యాన్ని ఆసీస్ ఆటగాళ్లు అవలీలగా చేధించారు. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఆస్ట్రేలియా నుంచి గ్రీన్‌ (61) అర్ధ సెంచరీ చేయగా.. స్టీవెన్‌ స్మిత్‌ (35), వేడ్‌ (45 నాటౌట్‌) రాణించారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 3, ఉమేశ్ యాదవ్ 2, చహల్ ఒక వికెట్ తీశారు. 

హార్దిక్ పాండ్యా శ్రమ వృధా

అంతకుముందు భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. హార్దిక్ పాండ్యా (71 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్, కేఎల్ రాహుల్ (55) అర్ధసెంచరీ, సూర్యకుమార్ యాదవ్ (46) దూకుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు సాధించి ఆస్ట్రేలియాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే భారత్ పెట్టిన టార్గెట్ ను ఆస్ట్రేలియా ఈజీగా సాధించింది. ఈ విజయంతో ఆసీస్ మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 23న నాగపూర్ లో జరగనుంది