యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారు

యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారు

యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారు

    సీట్ల సర్దుబాటులో  ప్రియాంకదే కీలక పాత్ర

లక్నో :  ఈ మేరకు ఇండియా కూటమి నేతల మధ్య ఒప్పందం కుదిరింది. బుధవారం సాయంత్రం లక్నోలోని ఓ హోటల్‌‌లో ఎస్పీ, -కాంగ్రెస్  నేతలు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యూపీ ఇన్‌‌చార్జ్ అవినాశ్ పాండే మాట్లాడుతూ.."యూపీలోని 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని చెప్పడానికి సంతోషంగా ఉంది. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించడమే ఇండియా కూటమి టార్గెట్" అని వివరించారు.

పొత్తు నిర్ణయంలో ప్రియాంకదే కీలక పాత్ర

ఉత్తరప్రదేశ్​లో  కాంగ్రెస్-, ఎస్పీల మధ్య సీట్ల సర్దుబాటుపై సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా  జరిపిన సంప్రదింపులే కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారిద్దరూ  రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత అఖిలేశ్​తో మాట్లాడినట్లు తెలిపాయి. మంగళవారం సాయంత్రం ఎస్పీ ఏకపక్షంగా మూడో లిస్ట్ రిలీజ్ చేసింది. దాంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండదని అంతా భావించారు. కానీ కూటమిని గాడిలో పెట్టేందుకు ప్రియాంక గాంధీనే స్వయంగా ఎస్పీ చీఫ్ అఖిలేశ్​తో ఫోన్​లో మాట్లాడినట్లు సమాచారం.