ఇయ్యాల(నవంబర్ 7) ఎల్​బీ స్టేడియం ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు

ఇయ్యాల(నవంబర్ 7) ఎల్​బీ స్టేడియం ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
  •     ప్రధాని మోదీ సభ నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్స్
  •     మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 వరకు అమలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఇయ్యాల ఎల్​బీ స్టేడియంలో ప్రధాని మోదీ బహిరంగ సభ నేపథ్యంలో ఆ ఏరియాలో  ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఎల్​బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌‌‌‌ డైవర్షన్స్ అమల్లో ఉంటాయని సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను సోమవారం ఆయన రిలీజ్ చేశారు. బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పోలీసులు సూచించిన మార్గాల్లో వాహనదారులు ప్రయాణించాలని సూచించారు.

ట్రాఫిక్ డైవర్షన్ ఇలా..

    బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్​ను అనుమతించరు. ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ వద్ద నాంపల్లి, రవీంద్రభారతి వైపు వెహికల్స్ ను దారి మళ్లిస్తారు. 

    అబిడ్స్, గన్ ఫౌండ్రీ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెహికల్స్ ను అనుమతించరు. గన్ ఫౌండ్రీ ఎస్బీఐ వద్ద చాపెల్ రోడ్ మీదుగా దారి మళ్లిస్తారు. 

    ట్యాంక్‌‌‌‌ బండ్‌‌‌‌ నుంచి బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌ వైపు వచ్చే ట్రాఫిక్‌‌‌‌ను లిబర్టీ జంక్షన్‌‌‌‌, హిమాయత్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ వైపు దారి మళ్లిస్తారు.

బహిరంగ సభకు వచ్చే వెహికల్స్ పార్కింగ్ ఏరియాలు

     సికింద్రాబాద్‌‌‌‌, ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌ వైపు నుంచి వచ్చే వెహికల్స్ ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి.  
    మెహిదీపట్నం, నిరంకారి భవన్ నుంచి వచ్చే వెహికల్స్ ను పబ్లిక్ గార్డెన్స్​లో పార్క్ చేయాలి.
    ఎల్​బీనగర్, దిల్​సుఖ్​నగర్, ముషీరాబాద్, అంబర్ పేట నుంచి వచ్చే వెహికల్స్​ను  నిజాం కాలేజీ గ్రౌండ్‌‌‌‌లో పార్క్‌‌‌‌ చేయాలి.
    వీఐపీ వెహికిల్స్ టెన్నిస్ కోర్టులో, మీడియా వెహికల్స్ మహబూబియా కాలేజీ గ్రౌండ్‌‌‌‌లో పార్క్‌‌‌‌ చేయాలి.