Dasara 2025 : పండక్కి ఇంటిని శుభ్రం చేస్తున్నారా.. ఈ వస్తువులు బయట పారేయండి.. నెగెటివ్ ఎనర్జీని తీసేయండి..!

Dasara 2025 : పండక్కి ఇంటిని శుభ్రం చేస్తున్నారా.. ఈ వస్తువులు బయట పారేయండి.. నెగెటివ్ ఎనర్జీని తీసేయండి..!

దసరా ఉత్సవాలు సెప్టెంబర్​ 22  సోమవారం నుంచి  ప్రారంభం కానున్నాయి.   పండుగ అంటే చాలు.. ఇంటిని శుభ్రం చేయడం.. కొత్త బట్టలు కొనుక్కోవడం  ఇవన్నీ మామూలే.  కాని జనాలు ఓ ముఖ్యమైన సంగతి మాత్రం మర్చిపోతారు. కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే దురదృష్టం..  ప్రతికూలతలు కలుగుతాయని  పండితులు చెబుతున్నారు. నవరాత్రుల సమయంలో అలాంటి వస్తువులను తొలగించాలి.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . . 

దసరా నవరాత్రిళ్లు సెప్టెంబర్​ 22 న ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తారు.   ఈ సమయంలో అమ్మవారి ఆశీస్సులను పొందడానికి, ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలి. 

వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల సంపదకు ఆటంకం కలిగి, ప్రతికూల శక్తులు ఏర్పడతాయని నమ్ముతారు. నవరాత్రి సమయంలో వీటిని తొలగించడం వల్ల అదృష్టం, సంతోషం, శాంతి కలుగుతాయని విశ్వసిస్తారు. 

తొలగించాల్సిన వస్తువులు 

విరిగిన విగ్రహాలు..  చిత్రపటాలు: నవరాత్రుల సమయంలో విరిగిన దేవతా విగ్రహాలు ..  చిరిగిన ఫోటోలను ఇంట్లో ఉంచడం అశుభకరంగా భావిస్తారు. అమ్మవారి ఆశీస్సులు పొందడానికి వాటి స్థానంలో కొత్త విగ్రహాలు ..  చిత్రపటాలను ప్రతిష్టించుకోవాలి. 

 చిరిగిన దుస్తులు: పాత..  చిరిగిన, ఉపయోగించని దుస్తులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తికి ఆటంకం ఏర్పడుతుంది. వాస్తు ప్రకారం కూడా ఇది మంచిది కాదు. అవసరమైన వారికి ఆ దుస్తులను దానం చేయండి. 

పనిచేయని గడియారాలు: వాస్తు ప్రకారం, పనిచేయని గడియారాలు ఇతర  ఎలక్ట్రానిక్​ పరికరాలను ఇంట్లో ఉంచడం వల్ల జీవితంలో, ఇంట్లో స్తబ్ధత పెరుగుతుంది. మీ ఇంట్లోని అన్ని గడియారాలు పనిచేసేలా చూసుకోండి. 

తుప్పు పట్టిన, విరిగిన పాత్రలు: నవరాత్రి సమయంలో దెబ్బతిన్న ...  తుప్పు పట్టిన పాత్రలను ఉపయోగించడం వలన ఆర్థికంగా నష్టం కలుగుతుంది.  ఇలాంటివి వెంటనే తీసేయండి

ఉపయోగించని వస్తువులు:  ఇంట్లో ఉపయోగించకుండా.. ఉన్న వస్తువులను తీసేయండి.  ఇలాంటివి సంపదకు.. శాంతికి  ఆటంకాన్ని ఏర్పరుస్తాయి. అలాంటి వాటిని వెంటనే తీసేయాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.  ఉపయోగించని.. చెప్పులను కూడా బయట పడేయండి.

భారతదేశంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో దసరా నవరాత్రి ఒకటి. దుర్గాదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజుల్లో అంతా అమ్మవారిని కొలిచేందుకు సిద్ధమవుతుంటారు. తమ తాహతకు తగ్గట్టుగా పూజలు పునస్కారాలు చేసుకుని దసరాను చేసుకుంటారు.