
హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. గంగాబలీ లో ఫర్నిచర్ గోదాంలో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోదాంలో ఎగసిపడుతున్న మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.