నర్సంపేట, వెలుగు : వరంగల్జిల్లా నర్సంపేటలో రూ.20 లక్షలతో మెప్మా ఆర్పీ ఉడాయించిన ఘటన ఆలస్యంగా బయటకువచ్చింది. నర్సంపేట టౌన్ లోని 19వ వార్డుకు చెందిన స్రవంతి మెప్మాలో ఆర్పీగా కొన్నేండ్ల నుంచి పనిచేస్తోంది. పొదుపు మహిళా సంఘాల లావాదేవీలను నిర్వహిస్తోంది.
కాగా రెండు నెలల నుంచి సంఘాల ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వెలుగు చూశాయి. ఈవిషయమై నెల కింద పొదుపు సంఘాల మహిళలు స్రవంతిని నిలదీసినట్లు సమాచారం. తన బండారం బయటపడడంతో 20 రోజుల కింద స్రవంతి పరారైంది. 21 సంఘాలకు చెందిన 20 లక్షల రూపాయలతో ఉడాయించినట్లు పొదుపు మహిళలు గుర్తించి శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
