తమిళనాడు ఫలితాలు : డీఎంకే పార్టీ ఓట్లు అడ్డంగా చీల్చిన విజయ్ టీవీకే పార్టీ

తమిళనాడు ఫలితాలు : డీఎంకే పార్టీ ఓట్లు అడ్డంగా చీల్చిన విజయ్ టీవీకే పార్టీ

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ డైనమిక్. ఊహకు అందవు అనగానికి ఈ ఫలితాలే నిదర్శనం. తమిళ జనం నాడి పట్టటం ఎగ్జిట్ పోల్స్ సాధ్యం కాదని మరోసారి నిరూపితం అయ్యింది. గత ఎన్నికలకు భిన్నంగా.. ఈసారి తమిళనాడు ఎన్నికలు జరిగాయి. హీరో విజయ్ తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీ పెట్టటం.. ఏడాది ముందే ఇది ప్రారంభం కావటం.. సింగిల్ గా ఎన్నికల్లో పోటీ చేయటం చకచకా జరిగిపోయాయి. 

ఎగ్జిట్ పోల్స్ వరకు విజయ్ పార్టీ టీవీకే సీట్లతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నీ ఇప్పుడు తలకిందులు అయ్యాయి. విజయ్ పార్టీకి అనుభవం లేదని.. అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి ఆదరణ లేదని.. డీఎంకే పార్టీనే మళ్లీ గెలుస్తుందని ఆల్ మోస్ట్ అందరూ అంచనా వేశారు. 

ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. విజయ్ పార్టీ అనూహ్యంగా దూసుకొచ్చింది. 
విశేషం ఏంటంటే డీఎంకే ఎన్ని సీట్లు అయితే గెలుస్తుంది అని అంచనా వేశారో.. ఆ సీట్లను విజయ్ టీవీకే పార్టీ ఆధిక్యంలోకి రావటం విశేషం. 
డీఎంకే పార్టీ కచ్చితంగా 100 సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తే.. ఫలితాలు విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపటం అనూహ్యమైన మలుపు.

ఇప్పుడు టీవీకే పార్టీకి వచ్చిన ఓట్లన్నీ అధికార డీఎంకే పార్టీవే అని స్పష్టం అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత అంతా టీవీకే వైపు వెళ్లింది. అన్నాడీఎంకే పార్టీకి ఉన్న సంప్రదాయ ఓట్లు అలాగే కొనసాగాయి. అంటే.. టీవీకే పార్టీకి వచ్చిన ఓటు షేర్.. డీఎంకే పార్టీ నుంచే వచ్చిందని ప్రాథమిక అంచనా. 

నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి.. డీఎంకే పార్టీ 23 శాతం ఓట్లు రాబట్టుకుంటే.. టీవీకే పార్టీ ఏకం 38 శాతం ఓట్లు రాబట్టుకుని.. డీఎంకే పార్టీకి చెందిన 15 శాతం ఓట్లకు గండి కొట్టింది. 

2021 ఎన్నికల్లో.. డీఎంకే పార్టీ 38 శాతం ఓట్లు రాబట్టుకుంటే.. ఈసారి ఇప్పటి వరకు 23 శాతం ఓట్లతో మూడో స్థానంలోకి పడిపోయింది. ఎన్నికల ఫలితాలు కంప్లీట్ అయ్యే సమాయానికి ఓట్ల శాతంలో కొద్దిగా మార్పులు ఉండొచ్చు.