చెట్ల పొదల్లో పసికందు.. శిశు విహార్​కు తరలించిన పోలీసులు

చెట్ల పొదల్లో పసికందు.. శిశు విహార్​కు తరలించిన పోలీసులు

ఘట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేసర్, వెలుగు: పసికందును గుర్తు తెలియని వ్యక్తులు చెట్లపొదల్లో విడిచి వెళ్లిన ఘటన ఘట్​కేసర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా బీబీనగర్​కు చెందిన రమేశ్ దంపతులు బుధవారం అబ్దుల్లాపూర్ మెట్ నుంచి బాచారానికి బైక్​పై వెళ్తున్నారు. ఘట్ కేసర్ పరిధి జేకే కన్వెన్షన్ వద్ద ఓ చిన్నారి ఏడుపు వినిపించడంతో రమేశ్ బైక్​ను ఆపి అక్కడికి వెళ్లి చూశాడు.

 చెట్ల పొదల్లో ఆడ శిశువు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాములు అక్కడికి చేరుకుని పసికందును ఘట్ కేసర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి ఏడు రోజుల వయసు ఉండొచ్చని డాక్టర్లు తెలిపారు. ప్రైమరీ ట్రీట్ మెంట్ అనంతరం పాపను శిశు విహార్​కు అప్పగించినట్లు పోలీసులు చెప్పారు.