మూడో రోజు ఐటీ సోదాలు.. కీలక ఫైళ్లు స్వాధీనం..

మూడో రోజు ఐటీ సోదాలు.. కీలక ఫైళ్లు స్వాధీనం..

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్​రెడ్డి, ఫైళ్ల శేఖర్​రెడ్డితో ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారుల సోదాలు మూడో రోజూ(జూన్​ 16) ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్నాయి. జూన్​ 14న ప్రారంభమైన ఈ సోదాలు మూడ్రోజులుగా కొనసాగుతుండటం.. పలు కీలక డాక్యుమెంట్లు, స్వాధీనం చేసుకున్నట్లు లీక్​లు రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది.

బెంగళూరు, హైదరాబాద్​తో పాటు రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల టార్గెట్​గా ఇవి జరుగుతున్నాయి. ప్రతి రోజు అర్ధరాత్రి వరకు సోదాలు జరగుతున్నాయి. సుమారు 60 ప్రాంతాల్లో 400 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. హార్డ్​ డిస్క్​లు, బ్యాంక్​ లాకర్స్​ స్వాధీనం చేసుకున్నారు. అధికారులు  ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి కి  సైతం నోటీసులిచ్చి వెళ్లిపోయారు. బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులపై ఐటీ దాడులు జరగడాన్ని నిరసిస్తూ.. ఆ పార్టీ నేతలు అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.  ఈ దాడులపై అధికార, ప్రతిపక్ష  పార్టీ మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది.