స్కూళ్లు, కాలేజీల రీ ఓపెన్ తో బుక్స్,బ్యాగులకు గిరాకీ

స్కూళ్లు, కాలేజీల రీ ఓపెన్ తో బుక్స్,బ్యాగులకు గిరాకీ
  •      సిటీలోని షాపుల్లో షురువైన బిజినెస్  
  •     స్టాక్ రెడీ గా ఉంచిన యజమానులు
  •     రెండు అకడమిక్ ఇయర్లలో నష్టాలే


కరోనా కారణంగా రెండేండ్లుగా ఆన్​లైన్​ క్లాసులే జరుగుతుండగా విద్యకు సంబంధించిన అన్ని బిజినెస్​లు డీలా పడిపోయాయి. సెప్టెంబర్ ఒకటి నుంచి మళ్లీ విద్యాసంస్థలు స్టార్ట్​ అవుతుండగా వ్యాపారాలు షురూ అయ్యాయి. ప్రభుత్వం విద్యాసంస్థల రీ ఓపెన్ ప్రకటన చేయడంతో స్టూడెంట్స్, పేరెంట్స్ పుస్తకాలు, బ్యాగులు, స్టేషనరీ సామగ్రి కొనేందుకు వెళ్తుండగా షాపులు సందడిగా మారాయి. మొన్నటిదాకా ఖాళీగా కనిపించిన షాపుల్లో ఇప్పుడు రద్దీ నెలకొంది.  యూనిఫామ్స్, బ్యాగ్​లు, టిఫిన్ బాక్స్​లు, వాటర్ బాటిళ్లు, సైకిళ్లు, పెన్నులు, కంపాక్స్ లు ఇలా అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తుండగా, ఆగిపోయిన వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటున్నాయని షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. 
షాపుల్లో పెరిగిన కొనుగోలు
క్లాసులకు హాజరైతే నోట్ బుక్స్, టెక్ట్స్ బుక్స్, స్టడీ మెటీరియల్​ఉండాలి.  దీంతో కోఠి, అబిడ్స్ తదితర ఏరియాల్లోని షాపులకు  స్టూడెంట్స్, పేరెంట్స్ వెళ్లి కొనుగోలు చేస్తుండగా సందడిగా కనిపిస్తున్నాయి.  స్కూల్​ నుంచి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ ​మెటీరియల్​ కోసం ఎక్కువగా వస్తున్నారని ఇప్పుడిప్పుడే రద్దీ పెరుగుతోందని స్టోర్ నిర్వాహకులు సంతోష్ చెప్పారు. మొన్నటి వరకు సీజన్​లో జరిగే బిజినెస్ లో 20 శాతమే జరిగిందని పేర్కొన్నారు.  మరో వైపు   డ్రెస్ లు, షూస్, సాక్స్ లు, టిఫిన్ డబ్బాలు, బ్యాగులపై కరోనా.. లాక్​డౌన్​ కారణంగా ట్రాన్స్ పోర్ట్ చార్జీలు పెరగడంతో  అదనంగా 30 శాతం వరకు ధరలు పెరిగాయని అంటున్నారు.  

బిజినెస్​లేక ఇబ్బందులు పడుతున్నం

స్కూల్, కాలేజ్ బ్యాగ్​లు, రెయిన్ కోట్లు, సైకిళ్లు అమ్ముతాం.  10 లక్షల స్టాక్ తెచ్చి పెట్టాం. కరోనాతో రెండేళ్ల నుంచి బిజినెస్ లేదు. ఇప్పటికే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నాం.  స్కూల్స్​, కాలేజీలు​ ఓపెన్​ అవుతుండగా కస్టమర్లు రావడం మొదలైంది. ఈ సారైనా బిజినెస్​ బాగుంటుందని ఆశిస్తున్నాం.
                                                                                                    - మహ్మద్ జకీల్, షాప్ ఓనర్, కోఠి