ప్రమాదాలను అరికట్టేందుకే చలాన్ల పెంపు

ప్రమాదాలను అరికట్టేందుకే చలాన్ల పెంపు

ప్రమాదాలను అరికట్టేందుకే భారీగా ట్రాఫిక్‌ చలాన్లు పెంచినట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. రేపటి నుంచి దేశ వ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలు కానున్నట్లు తెలిపారు. తెలంగాణలో మాత్రం కోర్టుకు వెళ్లే చలానాలు మాత్రమే రేపటి(ఆదివారం) నుంచి అమలు అవుతాయన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, మైనర్ల డ్రైవింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కేసుల్లో కోర్టుకు హాజరయ్యే కేసులకే పెంచిన చలాన్లు అమలవుతాయని చెప్పారు. ఆన్‌లైన్‌, ఈ-సేవల్లో కట్టే చలాన్లు మాత్రం ప్రభుత్వం అనుమతితో పెంచుతామని, కాబట్టి ఇంతకు ముందున్న చలాన్లు మాత్రమే వాహనదారులకు విధించనున్నట్లు తెలిపారు డీసీపీ విజయ్ కుమార్.