న్యూఢిల్లీ: ఇంక్రెడ్ ఫైనాన్స్ ఐపీఓ ద్వారా రూ.3వేల నుంచి రూ.4వేల కోట్లు సేకరించేందుకు కాన్ఫిడెన్షియల్ రూట్‌లో సెబీ వద్ద పేపర్లు సబ్మిట్ చేసింది. 2024–25 లో ఈ కంపెనీ రూ.372 కోట్ల నికర లాభాన్ని, రూ.1,255 కోట్ల ఆదాయాన్ని సాధించింది. అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) 2023–24తో పోలిస్తే 39శాతం పెరిగి రూ.12,585 కోట్లకు చేరింది. దేశం మొత్తంమీద 140 బ్రాంచ్‌లు, 2,600 ఉద్యోగులతో 4 లక్షల కస్టమర్లకు సేవలందిస్తున్నామని ఇంక్రెడ్ ఫైనాన్స్ పేర్కొంది.
వచ్చే ఏడాది రాపిడో ఐపీఓ..
బైక్ టాక్సీ అగ్రిగేటర్ రాపిడో వచ్చే ఏడాది చివరినాటికి ఐపీఓకి రావాలని ప్లాన్ చేస్తోంది. ట్యాక్సీ సర్వీస్‌లలో పోటీ కంపెనీల కంటే పై స్థాయికి చేరాలని టార్గెట్ పెట్టుకుంది. ప్రాఫిట్‌లోకి వచ్చామని, కంపెనీకి బ్రాండ్ క్యాంపెయిన్ ఖర్చు తప్ప మరే ఖర్చులు లేవని రాపిడో పేర్కొంది. స్విగ్గీ ఇటీవల 2.3 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ వద్ద రాపిడోలో12శాతం వాటాను రూ.2,400 కోట్లకు అమ్మింది.
