ODI World Cup 2023 Final: కన్నులపండుగగా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైనల్.. యుద్ధ విమానాలతో ఎయిర్ షో

ODI World Cup 2023 Final: కన్నులపండుగగా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైనల్.. యుద్ధ విమానాలతో ఎయిర్ షో

భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ సంగ్రామం చివరి దశకు చేరుకుంది. ఈ మెగా టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ మిగిలివుండగా, టైటిల్‌ పోరులో ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనునున్నాయి. ఆదివారం(నవంబర్ 19) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ పోరుకు బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది. భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించనుంది.

మొదలైన రిహార్సల్స్

ఫైనల్‌ మ్యాచ్ ప్రారంభం కావడానికి పది నిమిషాల ముందు భారత వాయు సేనకు చెందిన సూర్య కిరణ్‌ ఏరోబాటిక్‌ బృందం విన్యాసాలు చేయబోతోంది.  మొత్తం తొమ్మిది  యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ మేరకు గుజరాత్‌కు చెందిన డిఫెన్స్ ప్రో ప్రకటన చేసింది. ఇప్పటికే ఆ దిశగా రిహార్సల్స్ కూడా మొదలయ్యాయి. నరేంద్ర మోడీ స్టేడియంపై యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హాజరుకానున్న మోడీ

భారత్‌-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌ చూసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారని సమాచారం. అయితే దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.