Cricket World Cup 2023: బంగాళాఖాతంలో తుఫాన్.. ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంటుందా?

Cricket World Cup 2023: బంగాళాఖాతంలో తుఫాన్.. ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంటుందా?

వరల్డ్ కప్ గెలవడానికి టీమిండియా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లో గెలిచిన భారత్.. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ పై నెగ్గింది. దీంతో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండానే అజేయంగా ఫైనల్ కు చేరిన జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఈ నేపథ్యంలో మూడో సారి వరల్డ్ కప్ టైటిల్ గెలిచేందుకు ఆస్ట్రేలియాపై తుది సమరానికి సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ సజావుగా సాగుతుందా..? లేకపోతే వర్షం పడే సూచనలు ఎంత వరకు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

Accuweather ప్రకారం, అహ్మదాబాద్‌లో నవంబర్ 19 (ఆదివారం) న వర్షం పడే అవకాశాలు లేవు. ఇక్కడ వర్షం పడే అవకాశం సున్నా శాతంగా ఉంది. బంగాళ ఖాతంలో తుఫాన్ ఉన్నప్పటికి పశ్చిమాన ఉన్న గుజరాత్ లో ఎలాంటి వర్షాలు కురిసే అవకాశాలు లేదు. ఒకవేళ పడినా తొలకరి జల్లులే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. దీంతో ఈ మ్యాచ్ కు ఎలాంటి  తుఫాన్ ముప్పు లేదు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 20 డిగ్రీలు ఉండడంతో ఈ మ్యాచ్ ఎలాంటి అంతరాయం లేకుండా జరగడం ఖాయంగా కనిపిస్తుంది.

మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రపంచకప్ ఫైనల్‌లో 100 ఓవర్లు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 
చివరిసారిగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో  ఐపీఎల్ 2023 ఫైనల్ జరిగినప్పుడు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. అయితే, ఈసారి అలాంటి సూచనలు ఏమీ కనబడటం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం సీటింగ్ సామర్ధ్యం లక్ష 30 వేలు కావడం విశేషం.