IND vs NZ: గిల్‌కు లైన్ క్లియర్.. అత్తమామలకు కోడలను చూపించిన కెమెరామెన్

IND vs NZ: గిల్‌కు లైన్ క్లియర్.. అత్తమామలకు కోడలను చూపించిన కెమెరామెన్

భారత యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్, సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ మధ్య కొత్త బంధం చిగురించేలా కనపస్తోంది. ఇప్పటివరకూ వీరి మధ్య ఎలాంటి ప్రేమ లేకపోయినా.. అభిమానులు, కెమెరామెన్‌లు మధ్యవర్తులుగా వ్యవహరించి వీరిని ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం వాంఖడే వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ పోరులో అలాంటి సన్నివేశాలు ఎన్నో కనిపించాయి. 

ఈ మ్యాచ్‌లో గిల్ బౌండరీ కొట్టిన ప్రతిసారి కెమెరామెన్ సారానే స్క్రీన్ పై చూపించారు. ఆమె కూడా చప్పట్లు కొడుతూ అతన్ని ఉత్సాహ పరిచింది. ఒకానొక సంధర్భంలో గిల్ తల్లిదండ్రులను, సారాను కెమెరామెన్ ఒకే సమయంలో స్క్రీన్ పై చూపించారు. దీంతో అభిమానులు గట్టిగా అరుస్తూ నానా  హడావుడి చేశారు. ఆ దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఒకరకంగా కెమెరామెన్‌పైనా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అత్తమామలకు కోడలను చూపించాడని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.