IND vs SA: సఫారీల ఎత్తుగడలు.. పక్కా ప్లాన్‌తో రోహిత్‌ను ఔట్ చేసిన రబడా

IND vs SA: సఫారీల ఎత్తుగడలు.. పక్కా ప్లాన్‌తో రోహిత్‌ను ఔట్ చేసిన రబడా

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు ఆదిలోనే కష్టాల్లో పడింది. 24 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. భారీ స్కోర్లు చేస్తారనుకున్న ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. 5 పరుగుల వద్ద రోహిత్ శర్మను కగిసో రబడా బోల్తా కొట్టించగా.. 17 పరుగుల వద్ద యశస్వీ జైశ్వాల్ ను బర్గర్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన గిల్ (2) కూడా సఫారీ బౌలర్లకు అడ్డు నిలబడలేకపోయాడు. దీంతో బలమైన భారత టాఫార్దర్ తొలి గంటలోపే పెవిలియన్ చేరింది.   

భారత ఓపెనర్లను ఔట్ చేయడంలో సఫారీ ఆటగాళ్లు వ్యూహాలు పన్నినట్లు కామెంటేటర్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మను ట్రాప్‌ చేసి మరీ ఔట్ చేశారని వ్యాఖ్యానించారు. ఫుల్ షాట్లు ఆడటంతో దిట్టైన రోహిత్‌ను రబడా అదే బంతితో బోల్తా కొట్టించాడు. శరీరం మీదకు బౌన్సర్లు విసిరుతూ పుల్ షాట్లు ఆడేలా అతన్ని రెచ్చోగొట్టాడు. అందుకు తగ్గట్టు ఫీల్డర్లను మోహరించి  వలలో బంధించాడు. పుల్ షాట్‌కు యత్నించిన హిట్ మ్యాన్ బౌండరీ లైన్ వద్ద ఉన్న బర్గర్ చేతికి చిక్కాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇక ఈ మ్యాచ్‌ విషయానికొస్తే.. లంచ్ విరామ సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి(33), శ్రేయస్‌ అయ్యర్‌(31) భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.