IND vs SA: తొలి టెస్టుకు రవీంద్ర జడేజా దూరం.. ఏంటి ఈ Neck Spasm..? 

IND vs SA: తొలి టెస్టుకు రవీంద్ర జడేజా దూరం.. ఏంటి ఈ Neck Spasm..? 

నేటి నుంచి సెంచూరియ‌న్‌ వేదికగా భార‌త్, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. భారత జట్టు మొదట బ్యాటింగ్ మొదలు పెట్టింది. అయితే, భారత తుది జట్టులో ఒక అనూహ్య మార్పు జరిగింది. ముందుగా అనుకున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో జడేజాను ఎందుకు తప్పించారనే ప్రశ్నలు ఎదురవ్వగా.. బీసీసీఐ వివరణ ఇచ్చింది.

రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్న జడేజా ఉదయం అసౌకర్యంగా కనిపించినట్లు తెలిపింది. అతడు Neck Spasm(మెడ నొప్పి) బారిన పడినట్లు వెల్లడించింది. అందునా వెన్ను కండరాలు పట్టేయడంతో జడేజా అంత సౌకర్యవంతంగా లేకపోవడంతో అతని స్థానంలో అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ మ్యాచ్ ద్వారా భారత పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు.    

 అశ్విన్ పేలవ రికార్డు

సఫారీ గడ్డపై అశ్విన్ ప్రదర్శన అంతంత మాత్రమే. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికాలో 6 టెస్టులు ఆడిన అశ్విన్ 6 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో అతన్ని తుది జట్టులోకి తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే లోయర్ ఆర్డర్‌లో బ్యాట్‌ తోనూ రాణించగల సమర్థుడు అశ్విన్.