గిల్ సెంచరీ.. ఇండియా 500 పరుగులు : విండీస్ బౌలర్లను చిత్తుచిత్తుగా కొడుతున్న కుర్రోళ్లు

గిల్ సెంచరీ.. ఇండియా 500 పరుగులు : విండీస్ బౌలర్లను చిత్తుచిత్తుగా కొడుతున్న కుర్రోళ్లు

వెస్టిండీస్ తో జరుతున్న రెండో టెస్టులో సెంచరీల మోత మోగుతోంది. యశస్వీ జైస్వాల్ తర్వాత కెప్టెన్ గిల్ అద్భుత సెంచరీ నమోదు చేశాడు. క్లాస్ బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీ చేసుకున్నాడు. మొత్తం 177 బంతులలో 13 ఫోర్లు, ఒక సిక్సుతో సెంచరీ పూర్తి చేశాడు. 130 వ ఓవర్లో 5వ బాల్ కు.. ఖేరీ పియరీ వేసిన బాల్ ను లెఫ్ట్ కవర్స్ వైపు పంపించి మూడు రన్స్ తీసిన గిల్.. ఈ టెస్టులో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

టెస్టుల్లో గిల్ కు ఇది పదో సెంచరీ. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఇది ఐదో టెస్టు సెంచరీ. ఒక క్యాలెండర్ ఇయర్ లో ఇండియా కెప్టెన్ కు ఇది 5వ టెస్టు సంచరీ కావడం విశేషం. అంతకు ముందు ఇదే ఫీట్ ను విరాట్ కోహ్లీ వరుసగా 2017, 2018లో సాధించాడు. టెస్టులలో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఐదు సెంచరీలు చేసిన కోహ్లీ ఫీట్ ను సమం చేశాడు గిల్. కేవలం 7 టెస్టులలో 5 సెంచరీలు నమోదు చేయడం విశేషం.

గిల్ సెంచరీతో పాటు ఇండియా స్కోర్ 500 మార్కును దాటింది. ప్రస్తుతం క్రీజులో గిల్ (122 రన్స్, 188 బంతులలో 16 ఫోర్లు, 2 సిక్సులు), ధృవ్ జురెల్ (42 రన్స్, 75 బాల్స లో 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. సెంచరీ తర్వాత కెప్టెన్ గిల్ స్పీడ్ పెంచాడు. దీంతో ప్రస్తుతం స్కోర్ 132 ఓవర్ల దగ్గర 4 వికెట్ల నష్టానికి 506.