మహిళా కూలీపై అసభ్య ప్రవర్తన.. నలుగురిపై కేసు నమోదు

మహిళా కూలీపై అసభ్య ప్రవర్తన.. నలుగురిపై కేసు నమోదు

ఎల్బీనగర్, వెలుగు: కూలి పనికి వెళ్తున్న మహిళపై కొందరు ఆకతాయిలు అసభ్యంగా  ప్రవర్తించి లైంగిక దాడికి  యత్నించారు. ఈ ఘటనలో నలుగురిపై కేసు నమోదు కాగా.. వారంతా పరారీలో ఉన్నారు. ఈ ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. లెనిన్​నగర్​లో నివాసముంటున్న ఓ మహిళ(40) మాదన్నపేట్ లోని ఓ మార్కెట్ లో కూలీగా పనిచేస్తోంది. 

రోజులానే మంగళవారం తెల్లవారుజామున పనికి వెళ్లేందుకు లెనిన్ నగర్ లోని బస్టాప్​కు వచ్చింది. అక్కడ బస్సు కోసం ఎదురుచూస్తుండగా నలుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. లైంగిక దాడికి యత్నించగా ప్రతిగటించడంతో దాడి చేసి పరారయ్యారు. బాధితురాలు మీర్ పేట్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇన్​స్పెక్టర్ నాగరాజు తెలిపారు.