ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

ఉమ్మడి కరీంనగర్​లోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలలో సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, లీడర్లు జెండా ఎగురవేశారు. కరీంనగర్ ​పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంత్రి గంగుల కమలాకర్​గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వేడుకల్లో పాల్గొని జిల్లాలో చేపడుతున్న అభివృద్ధిని వివరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించారు. జిల్లాలో ఉత్తమ సేవలందించిన 196 మంది ఉద్యోగులకు మంత్రి ప్రశంస పత్రాలు అందించారు. గ్రౌండ్ లో ప్రదర్శించిన వివిధ శాఖల శకటాలను తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లా కేంద్రంలోని ఖిల్లాలో, కలెక్టర్ క్యాంపు ఆఫీస్ లో కలెక్టర్ రవి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్టూడెంట్స్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

పెద్దపల్లి కలెక్టరేట్​లో ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​జెండా ఆవిష్కరించారు. వేడుకలలో కలెక్టర్ డాక్టర్ సంగీత, జడ్పీ చైర్మన్ పి.మధు, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీ నారాయణ, కుమార్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు, తిమ్మాపూర్ లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జమ్మికుంటలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మెట్ పల్లిలోని సివిల్ హాస్పిటల్, మార్కెట్, టీఆర్ఎస్ ఆఫీస్​లో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు జెండా ఆవిష్కరించారు.