- కాకా మాంటీస్సోరి స్కూల్ డైరెక్టర్ రోషిణి
ముషీరాబాద్ : మహిళా సాధికారత దిశగా దేశం అడుగులు వేయాలని బాగ్లింగంపల్లిలోని కాకా మాంటీస్సోరి స్కూల్డైరెక్టర్ రోషిణి ఆకాంక్షించారు. నేటికీ దేశంలో మహిళలపై అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. కాకా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ లో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా రోషిణి పాల్గొని, స్టూడెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు.
త్యాగ ధనుల పోరాటాలను కొనియాడారు. ఈ సందర్భంగా ఇనిస్టిట్యూషన్ స్టూడెంట్లు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఎన్ సీసీ స్టూడెంట్ల పరేడ్అబ్బురపరిచింది. జాయింట్ సెక్రెటరీ రమణ, సీఓఓ రాజేష్ కుంద్రా, డైరెక్టర్ రిషికాంత్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
