గన్ గురి అదిరింది.. ఏషియాడ్‌లో ట్రాప్ షూటర్లకు వరుస పతకాలు!

గన్ గురి అదిరింది.. ఏషియాడ్‌లో ట్రాప్ షూటర్లకు వరుస పతకాలు!

Asian Games 2026: ఏషియాడ్‌‌‌‌లో ఇండియా ట్రాప్‌‌‌‌ షూటర్లు మరోసారి మెరిశారు. బుధవారం జరిగిన ట్రాప్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌లో తెలంగాణ షూటర్‌‌‌‌ కైనన్‌‌‌‌ చినాయ్‌‌‌‌–నీరూ దండా జోడీ గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో కైనన్‌‌‌‌–నీరూ 34 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచారు. ఈ క్రమంలో కాంటినెంటల్‌‌‌‌ రికార్డును బద్దలు కొట్టారు. ఖతార్‌‌‌‌ గతంలో నెలకొల్పిన ఆసియా రికార్డు (30 పాయింట్లు) బ్రేక్‌‌‌‌ చేశారు. 

మహమ్మద్‌‌‌‌ అల్‌‌‌‌ రుమైహి–రే బాసిల్‌‌‌‌ (ఖతార్‌‌‌‌, 32 పాయింట్లు), క్వి యింగ్‌‌‌‌–సన్‌‌‌‌ యునాంగ్‌‌‌‌ (చైనా, 23 పాయింట్లు) వరుసగా సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ గెలుచుకున్నారు. క్వాలిఫికేషన్స్‌‌‌‌లో కైనన్‌‌‌‌ మెరుగ్గా ఆడి 73 పాయింట్లు సాధించగా, నీరూ 63 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకు షూటింగ్‌‌‌‌లో మూడు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి 15 మెడల్స్‌‌‌‌ వచ్చాయి.