IND VS ENG 2025: కెప్టెన్ ఒంటరి పోరాటం: గిల్ భారీ సెంచరీ.. 400 పరుగులు దాటిన టీమిండియా

IND VS ENG 2025: కెప్టెన్ ఒంటరి పోరాటం: గిల్ భారీ సెంచరీ.. 400 పరుగులు దాటిన టీమిండియా

ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో రెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి రోజు గిల్, జడేజా భాగస్వామ్యంతో కోలుకున్న టీమిండియా.. రెండో రోజు వీరి పట్టుదలతో 400 పరుగుల మార్క్ దాటింది. రెండో రోజు లంచ్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్ (168), వాషింగ్ టన్ సుందర్ (1) ఉన్నారు. రెండో సెషన్ లో సుందర్ తో కలిసి గిల్ ఎంతవరకు భారత జట్టును ముందుకు తీసుకెళ్తాడో ఆసక్తికరంగా మారింది.  

5 వికెట్ల నష్టానికి 310 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా తొలి సెషన్ లో జాగ్రత్తగా ఆడింది. గిల్, జడేజా ఎలాంటి అనవసర షాట్స్ జోలికి పోకుండా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో జడేజా తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. మరోవైపు తొలి రోజు సెంచరీ హీరో గిల్ 150 పరుగులను పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ పట్టుదలగా.. ఓపిగ్గా బ్యాటింగ్ చేయడంతో భారత్ తొలి సెషన్ లో ఆధిపత్యం చూపించింది.  ఆరో వికెట్ కు 203 పరుగుల భారీ భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు ఇంగ్లాండ్ కు వీరి జోడీని విడగొట్టింది. 

జోష్ టంగ్ బౌలింగ్ లో జడేజా వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 89 పరుగులు చేసిన జడేజా తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత సుందర్ తో కలిసి గిల్ మరో వికెట్ పడకుండా సెషన్ ముగించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో  వోక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. కార్స్, టంగ్, స్టోక్స్, బషీర్ తలో వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆటలో భాగంగా జైశ్వాల్ 87 పరుగులు చేసి రాణించాడు.