ఇండియా–ఎ కెప్టెన్‌‌‌‌గా శ్రేయస్‌‌‌‌.. సెప్టెంబర్ 16 నుంచి లక్నోలో ఆస్ట్రేలియా-ఎతో సిరీస్‌‌‌‌

ఇండియా–ఎ కెప్టెన్‌‌‌‌గా శ్రేయస్‌‌‌‌.. సెప్టెంబర్  16 నుంచి లక్నోలో ఆస్ట్రేలియా-ఎతో సిరీస్‌‌‌‌

ముంబై: ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌‌‌‌లో ఆడే ఇండియా టీమ్‌‌‌‌లో చోటు దక్కించుకోలేకపోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్  ఇండియా-–ఎ జట్టుకు  కెప్టెన్‌‌‌‌గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా –ఎ జట్టుతో లక్నోలో జరగనున్న రెండు అనధికారిక టెస్టుల ( నాలుగు రోజుల మ్యాచ్‌‌‌‌లు) సిరీస్‌‌‌‌లో తలపడే టీమ్‌‌‌‌కు అతను నాయకత్వం వహిస్తాడు. ఈ జట్టులో సీనియర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ రెండో మ్యాచ్‌‌‌‌కు అందుబాటులో ఉంటారని బీసీసీఐ శనివారం ప్రకటించింది. వెస్టిండీస్, సౌతాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌‌‌‌లకు ముందు వారికి ఇది మంచి ప్రాక్టీస్‌‌‌‌గా ఉపయోగపడనుంది. జట్టులో సాయి సుదర్శన్, పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్), ప్రసిధ్ కృష్ణ, నితీష్ రెడ్డికి కూడా చోటు దక్కింది. ఈ నెల 16 నుంచి తొలి మ్యాచ్,  23 నుంచి రెండో మ్యాచ్  జరుగుతుంది.

ఇండియా–ఎ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బదోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యశ్ ఠాకూర్.