పుదుచ్చేరి: ఆస్ట్రేలియా–ఎతో జరిగిన అనధికార తొలి టెస్ట్లో ఇండియా–ఎ జట్టు 162 రన్స్ తేడాతో విజయం సాధించింది. దాంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో హోమ్ టీమ్ 1–0 ఆధిక్యంలో నిలిచింది. 363 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు 55/2 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాలుగో రోజు బరిలోకి దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 55.1 ఓవర్లలో 200 రన్స్‌కు ఆలౌటైంది.
ఫెర్గుస్ ఓ నీల్ (47), నాథన్ మెక్‌స్వీని (35), జాసన్ సంగా (26) పోరాడారు. ఇన్నింగ్స్‌లో ఐదుగురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. తుషార్ దేశ్‌పాండే, శామ్స్ ములానీ చెరో మూడు, అన్షుల్ కాంబోజ్, తనుష్ కొటియాన్ చెరో రెండు వికెట్లు తీశారు. కుమార్ కుశాగ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మంగళవారం నుంచి రెండో టెస్ట్ జరుగుతుంది.
