రష్యాకు వ్యతిరేకంగా UNలో తీర్మానం.. భారత్ గైర్హాజరు

రష్యాకు వ్యతిరేకంగా UNలో తీర్మానం.. భారత్ గైర్హాజరు

ఉక్రెయిన్ - రష్యా యుద్దానికి ఏడాది గుడస్తున్న  నేపథ్యంలో రష్యా తన యుద్ధాన్ని ముగించాలని, శాశ్వత శాంతి నెలకొల్పాలని గురువారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. ఐక్యరాజ్య సమితిలోని మొత్తం 193 దేశాలకు గానూ.. 141 దేశాలు యూఎన్ తీర్మానానికి అనుకూలంగా  ఓటేశాయి.  7 దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. అయితే ఈ ఓటింగ్ కు భారత్ సహా 32 దేశాలు గైర్హాజరయ్యాయి.  ఫిబ్రవరి 24, 2022 ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుండి UN  జనరల్ అసెంబ్లీ ప్రవేశ పెట్టిన అనేక తీర్మానాలపై ఓటింగ్‌కు భారత్‌ తటస్థ వైఖరిని కొనసాగిస్తోంది.