
ఓవల్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరించింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి చేతలెత్తేసి ఘోరంగా విఫలమయ్యారు. జోష్ టంగ్, అట్కిన్సన్ విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం 224 పరుగులకే ఆలౌట్ అయింది. కరుణ్ నాయర్ 57 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లు పడగొట్టి మన జట్టును వణికించాడు. టంగ్ మూడు వికెట్లు తీసుకోగా.. వోక్స్ కు ఒక వికెట్ దక్కింది.
6 వికెట్ల నష్టానికి 204 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా తొలి అరగంటలోనే మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయింది. రెండో రోజు కేవలం 20 పరుగులు మాత్రమే చేసి నిరాశపరించింది. జోష్ టంగ్ ఒక అద్భుతమైన ఇన్ స్వింగ్ తో కరుణ్ నాయర్ (57) ను ఔట్ చేశాడు. ఆ వెంటనే అట్కిన్సన్ విజృంబిస్తూ లోయర్ ఆర్డర్ భరతం పట్టాడు. సుందర్ (26) తో పాటు సిరాజ్(0) ప్రసిద్ కృష్ణ (0) లను వెంటనే ఔట్ చేశాడు.
►ALSO READ | Yuzvendra Chahal: రోజుకు రెండు గంటలే పడుకునేవాడిని.. ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి: చాహల్
టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి రోజు తొలి సెషన్ లో రెండు వికెట్లు కోల్పోయింది. లంచ్ కు ముందు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఫామ్ లో ఉన్న రాహుల్(14) తో పాటు జైశ్వాల్(2) ఔటయ్యాడు. గిల్ అనూహ్య రనౌట్‌తో ఇండియా 83 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. సాయి సుదర్శన్ 38 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. జడేజా (9), ధ్రువ్ జురెల్ (19) తక్కువ పరుగులకే ఔటయ్యి నిరాశపరిచారు. వాషింగ్టన్ సుందర్, కరుణ్ నాయర్ 65 పరుగులు జోడించి టీమిండియాకు 200 పరుగుల మార్క్ అందించారు.
India add just 20 runs to their overnight total as Gus Atkinson completes a comeback five-wicket haul! https://t.co/rrZF1qfeQq #ENGvIND pic.twitter.com/Z2luob8oxf
— ESPNcricinfo (@ESPNcricinfo) August 1, 2025