IND vs AUS : చేతులెత్తేసిన టీమిండియా.. 163 ఆలౌట్.. గెలుపు కష్టమే

IND vs AUS : చేతులెత్తేసిన టీమిండియా.. 163 ఆలౌట్.. గెలుపు కష్టమే

ఆస్ట్రేలియాతో ఇండోర్ లో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆసీస్ స్పిన్ ఉచ్చులో పడి 163  పరుగులకు ఆలౌట్ అయ్యారు. మ్యాచ్ రెండో రోజు మొదటి సెషన్ లో బ్యాటింగ్ వచ్చిన భారత్ ఏ దశలోనూ ఆసీస్ బౌలర్లను ఎదుర్కోలేకపోయింది. టీమిండియా బ్యాటర్లలో పుజారా (59) మినహా  ఏ బ్యాటర్ క్రీజులో నిలబడలేక పోయారు. దీంతో మూడో సెషన్ ముగిసేసరికి 75 పరుగుల ఆధిక్యంలో నిలిచి ఆలౌట్ అయ్యారు. నాథన్ లియాన్ 8 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, కుహ్ నెమన్ చెరో ఒక వికెట్ పడగొట్టారు. 

మొదటి సెషన్లో ఆస్ట్రేలియా 88 పరుగుల లీడ్ తో 197 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తర్వత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా 163 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 74 పరుగులలోపు ఆస్ట్రేలియాను కట్టడి చేయాలి. 

ఈ మ్యాచ్ గణాంకాలు: 

  • భారత్ టెస్టుల్లో ఆడిన అతి తక్కువ ఓవర్లు 93.5 ఇదే మొదటి సారి. మొదటి ఇన్నింగ్స్ లో 33.2 ఓవర్లలో ఆలౌట్ అయింది.
  • భారత్ తరుపున 100 వికెట్లు తీసిన ఐదో పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్.
  • లియాన్ బౌలింగ్ లో పుజారా ఔట్ అవ్వడం ఇది 13వ సారి. ఏ బ్యాటర్ ఒక బౌలర్ చేతిలో ఇన్ని సార్లు ఔట్ కాలేదు.
  • జడేజా రెండు ఇన్నింగ్స్ లో సింగిల్ డిజిట్ స్కోరుకు ఔట్ అవ్వడం ఇది రెండో సారి. మొదట జనవరి 2019లో ఔట్ అయ్యాడు.
  • రెండు ఇన్నింగ్స్ ల్లో భారత్ 200 కంటే తక్కువ పరుగులకు ఆలౌట్ అవ్వడం ఇది రెండో సారి. మొదటిసారి 1978లో ఆలౌట్ అయింది.
  • భారత్ పై అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్ గా లియాన్ రికార్డు.  శ్రీలంక ముత్తయ మురళిధరన్ మొదటి స్థానంలో ఉన్నాడు. 

  

సంక్షిప్త స్కోరు:

మొదటి ఇన్నింగ్స్ భారత్: 109 ఆలౌట్
ఆస్ట్రేలియా: 197 ఆలౌట్ (88 పరుగుల లీడ్)
రెండో ఇన్నింగ్స్ భారత్ : 163 ఆలౌట్ (75 పరుగుల లీడ్)