
కొలంబో: అండర్-19 ఆసియాకప్‌లో ఇండియా కుర్రాళ్లు ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఇండియా, శ్రీలంక అండర్-19 జట్ల మధ్య గురువారం జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దాంతో, గ్రూప్ దశలో అత్యధిక పాయింట్లతో నిలిచిన ఇండియా ఫైనల్‌కు అర్హత సాధించింది. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య సెమీస్ కూడా వర్షంతో రద్దయింది. ఎక్కువ పాయింట్లతో ఉన్న బంగ్లా ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. శనివారం బంగ్లా, ఇండియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.