భారత్, రష్యాలల మధ్య నగదు బదిలీలు ఈజీ

భారత్, రష్యాలల మధ్య నగదు బదిలీలు ఈజీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్​పై యుద్ధం చేస్తున్నందుకు రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా ఆ దేశం నుంచి ఇతర దేశాలకు డబ్బులు పంపడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇండియా, రష్యా సమాలోచనలు జరుపుతున్నాయి. రెండు దేశాల మధ్య  చెల్లింపులను ఈజీ చేయడారికి రూపే, మీర్​కార్డులను పరస్పరం అనుమతించాలని భావిస్తున్నాయి. రూపే కార్డులను ఇండియా, మీర్​ కార్డులను రష్యా జారీ చేస్తాయి. వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక,  సాంస్కృతిక సహకారం (ఐఆర్​ఐజీసీ–టెక్​)పై ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి  సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ కార్డుల ఆమోదాన్ని అనుమతించే అవకాశాన్ని పరిశీలించడానికి రెండు దేశాలు అంగీకరించాయి.  ఫలితంగా ఇండియా, రష్యన్ పౌరులు తమ దేశాల్లో భారతీయ రూపాయి,  రష్యన్ రూబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇబ్బందులు లేకుండా డబ్బును చెల్లించగలుగుతారు. ఈ సమావేశాలకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ అధ్యక్షత వహించారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన  యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేస్ (యూపీఐ),  బ్యాంక్ ఆఫ్ రష్యా అందించే ‘ఫాస్ట్​ పేమెంట్స్​ సిస్టమ్​’ (ఎఫ్​పీఎస్) విధానాలను ఇరు దేశాలు వాడుకునే ప్రపోజల్​పైనా చర్చలు జరిగాయి.  సరిహద్దు చెల్లింపుల కోసం రష్యా ఫైనాన్షియల్​ మెసేజింగ్​ సిస్టమ్​ను,  బ్యాంక్ ఆఫ్ రష్యా  సర్వీసెస్ బ్యూరో ఆఫ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడుకోవడానికి రెండు దేశాలూ అంగీకరించాయి. ఇక నుంచి భారతదేశం నుంచి విదేశీ చెల్లింపులు  స్విఫ్ట్​ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ ద్వారా జరుగుతాయి.  ఆంక్షలు అమల్లో ఉన్నందున భారతదేశం స్విఫ్ట్​ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాకుండా వేరేదాన్ని ఎంచుకోవడం సాధ్యం కాదు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ యూపీఐ,  పేనౌ మధ్య క్రాస్​బార్డర్​ కనెక్టివిటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.  ఇండియా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేస్ (యూపీఐ),  సింగపూర్  పేనౌ వల్ల రెండు దేశాల్లోని ప్రజలు వేగంగా,  తక్కువ ఖర్చుతో  కూడిన డిజిటల్ పేమెంట్స్​ సేవలను పొందవచ్చు. 

రూపీ ట్రేడ్​ సెటిల్​మెంట్​ మెకానిజంలో రష్యా 

డాలర్లకు బదులు రూపాయల్లో వ్యాపారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రూపీ ట్రేడ్ ​సెటిల్​మెంట్​ మెకానిజం’లో ఇది వరకే రష్యాతోపాటు మారిషస్​, శ్రీలంక వంటి దేశాలు చేరాయి.  తజికిస్థాన్, క్యూబా, లగ్జెంబర్గ్ ఈ విధానాన్ని ఉపయోగించడం గురించి భారతదేశంతో మాట్లాడుతున్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ రిపోర్ట్​ వెల్లడించింది.  ఆంక్షల విధింపు వల్ల రష్యా డాలర్లలో చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మనదేశంతో వ్యాపారానికి రూపాయి సెటిల్​మెంట్​ విధానాన్ని ఉపయోగిస్తోంది.  రూపీ ట్రేడ్​సెటిల్​మెంట్​ మెకానిజాన్ని ఆర్​బీఐ  పోయిన ఏడాది జూలైలో అందుబాటులోకి తెచ్చింది. డాలర్ల కొరత ఉన్న దేశాలను ఈ విధానంలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  వోస్ట్రో ఖాతాలు అని పిలిచే ప్రత్యేక రూపాయి ఖాతాలను తెరవడానికి ఇదివరకే నాలుగు దేశాలు ఆసక్తి చూపాయి.