పెర్త్‌‌‌‌‌‌‌‌లో మొదలు..సిడ్నీలో ముగింపు

పెర్త్‌‌‌‌‌‌‌‌లో మొదలు..సిడ్నీలో ముగింపు
  • బోర్డర్‌‌‌‌‌‌‌‌-గావస్కర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ విడుదల

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌ : ఇండియా, ఆస్ట్రేలియా మధ్య  ప్రతిష్టాత్మకంగా జరిగే బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం విడుదల చేశారు. నవంబర్‌‌‌‌‌‌‌‌ 22–26 వరకు జరిగే తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌ను ఈసారి పెర్త్‌‌‌‌‌‌‌‌కు కేటాయించారు. గతంలో ఎప్పుడూ బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌లో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ జరిగేది. కానీ ఇరుదేశాల టైమింగ్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌కు పెర్త్‌‌‌‌‌‌‌‌ అనుకూలంగా ఉండటంతో సీఏ ఈ నిర్ణయం తీసుకుంది.  ఇక డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 6–10 వరకు జరిగే రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌ (అడిలైడ్‌‌‌‌‌‌‌‌ ఓవల్‌‌‌‌‌‌‌‌)ను డేనైట్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించనున్నారు.

డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 14–18 వరకు బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌లో మూడో టెస్ట్‌‌‌‌‌‌‌‌, 26–30 వరకు మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌లో బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ డే టెస్ట్‌‌‌‌‌‌‌‌, 2025 జనవరి 3–7 వరకు సిడ్నీలో ఐదో టెస్ట్‌‌‌‌‌‌‌‌ జరగనున్నాయి. 1991–92 తర్వాత తొలిసారి ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ను ఐదు టెస్ట్‌‌‌‌‌‌‌‌లకు పెంచారు. సిరీస్‌‌‌‌‌‌‌‌కు బలమైన ఆరంభం దక్కాలనే ఉద్దేశంతో పెర్త్‌‌‌‌‌‌‌‌కు తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌ కేటాయించామని క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియా పేర్కొంది. అడిలైడ్‌‌‌‌‌‌‌‌లో డేనైట్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆడటం తమకు లాభిస్తుందని వెల్లడించింది.