ఇండోర్లో ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు

ఇండోర్లో ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మూడో టెస్టు వేదికను బీసీసీఐ మార్చింది. రెండు జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాలలో మూడో టెస్టు జరగాల్సి ఉండగా..ఈ టెస్టును ఇండోర్ లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ధర్మశాలలో ఔట్ ఫీల్డ్ సిద్ధంగా లేకపోవడంతోనే వేదికను మార్చినట్లు వెల్లడించింది.  బీసీసీఐ క్యురేటర్‌ తపోష్‌ ఛటర్జీ ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం  స్టేడియం పిచ్‌, ఔట్‌ఫీల్డ్‌ను తనిఖీ చేసి బోర్డుకు నివేదిక అందించాడు. ఈ నివేదిక ప్రకారమే బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 


 
షెడ్యూల్ ప్రకారం భారత్- ఆసీస్ మధ్య మూడో టెస్టును ధర్మ శాలలో నిర్వహించాలి. అయితే చాలా రోజు నుంచి ఇక్కడ కాంపిటీటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జరగలేదు. ఈ నేపథ్యంలో టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీగా లేదని బోర్డు వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ క్యురేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తపోశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛటర్జీ ధర్మశాలలోని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీఏ స్టేడియానికి వెళ్లి పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశీలించాడు. అనంతరం నివేదిక అందించాడు. దీంతో ధర్మశాల నుంచి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బెంగళూరు లేదా వైజాగ్​కు తరలిస్తారని ముందుగా వార్తలు వచ్చాయి. చివరకు మూడో టెస్టును ఇండోర్ కు తరలించారు. మరోవైపు గతంలో ఈ స్టేడియానికి కేటాయించిన చివరి రెండు ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వర్షం వల్ల రద్దయ్యాయి.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పుర్‌లో జరిగిన మొదటి టెస్టులో  టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో టెస్టు  ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలో జరగనుంది.