ఈయూ టారిఫ్లపై వెనక్కి తగ్గిన ట్రంప్

 ఈయూ టారిఫ్లపై  వెనక్కి తగ్గిన ట్రంప్
  •     నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్ తో భేటీ.. ఆర్కిటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భద్రతపై ఒప్పందం 
  •     ‘నేను డిక్టేటర్ ని..’ కొన్నిసార్లు ఆ అవసరం ఉంటుందని కామెంట్
  •     గ్రీన్‌లాండ్ స్వాధీనానికి బలప్రయోగం చేయబోనని వెల్లడి

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: యూరోప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాలపై టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనక్కి తగ్గారు. ఆ దేశాలపై విధించాలనుకున్న వాణిజ్య సుంకాలను రద్దు చేస్తున్నట్లు  బుధవారం ప్రకటించారు.  నాటో సెక్రటరీ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రుట్టెతో ద్వైపాక్షిక సమావేశం అనంతరం ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.  గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దక్కించుకోవడానికి తాను సైనిక బలాన్ని ప్రయోగించబోనని స్పష్టం చేశారు. అదే సమయంలో, అమెరికా విస్తరణవాదాన్ని అడ్డుకోవద్దని నాటోను హెచ్చరిస్తూనే, యూరప్ మిత్రదేశాలపై విమర్శలు చేశారు. స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని దావోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో ట్రంప్ ప్రసంగించారు. ‘‘గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా చల్లగా, సరైన సౌకర్యాలు లేని ప్రాంతం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మేం యూరోప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రక్షించాం. దశాబ్దాలుగా మేం వారికి ఇచ్చిన దానితో పోలిస్తే గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడగడం చాలా చిన్న విషయం” అని వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను సైనిక బలాన్ని ఉపయోగిస్తే ఎవరూ అడ్డుకోలేరని, కానీ తాను అలా చేయాలనుకోవడం లేదని వెల్లడించారు. ‘‘నేను ఒక డిక్టేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అని అందరూ విమర్శిస్తుంటారు. కానీ ఈసారి నా ప్రసంగానికి మంచి రివ్యూలు రావడం చూసి ఆశ్చర్యపోయా” అని వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు దేశానికి ఒక డిక్టేటర్ అవసరం ఉంటుందని అన్నారు. తాను చేసే పనులు కేవలం ‘కామన్ సెన్స్’ తో కూడినవని, అవి పార్టీలకు సంబంధించినవి కావని పేర్కొన్నారు.

నాటో సెక్రటరీ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చర్చలు సఫలం

గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్, ఆర్కిటిక్ భద్రతకు ‘భవిష్యత్ ఒప్పంద ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్’ సిద్ధమైందని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ట్రంప్​ ‘ట్రూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోషల్’లో పోస్ట్​ పెట్టారు. ‘‘నాటో సెక్రటరీ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రుట్ తో  చర్చలు సఫలమయ్యాయి. గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్కిటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  భవిష్యత్తు ఒప్పందానికి ఓ ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపొందించాం. ఇది  అమెరికాతో పాటు నాటో మిత్ర దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే సుంకాలపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం” అని వివరించారు.  ఈ కొత్త ఒప్పందం భద్రతతో పాటు ఖనిజాల  విషయంలో అందరికీ మేలు చేస్తుందన్నారు. గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అరుదైన ఖనిజ నిక్షేపాలను పొందడం తన ప్రధాన లక్ష్యమని ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరోక్షంగా వెల్లడించారు. ఇది కేవలం తాత్కాలికం కాదని, భద్రత, ఖనిజాల కోసం ఉద్దేశించిన ‘శాశ్వత ఒప్పందం’ అని పేర్కొన్నారు.  గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో   ‘గోల్డెన్ డోమ్’ను ఏర్పాటు చేయడానికి చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.  అమెరికా వైస్​ ప్రెసిడెంట్​ జేడీ వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విదేశాంగ మంత్రి  మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విట్కాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీనిపై చర్చలు జరుపుతున్నారని తెలిపారు.  అయితే, తమ భేటీలో గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్ గురించి చర్చ రాలేదని, ఆర్కిటిక్ భద్రతపైనే దృష్టి సారించినట్లు నాటో చీఫ్ స్పష్టం చేశారు.

వెనెజువెలాపై ‘సీక్రెట్ సోనిక్ వెపన్’ వాడినం: ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించేందుకు తమ సైన్యం ‘సీక్రెట్ సోనిక్ వెపన్’ వాడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తమవద్దే ఈ తరహా శక్తిమంతమైన ఆయుధం ఉందని.. మరే దేశం వద్ద ఇలాంటి సాంకేతికత లేదని తెలిపారు. తాజాగా ఓ న్యూస్ చానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక కామెంట్లు చేశారు. అమెరికా దగ్గర ప్రపంచానికి తెలియని అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయని, వాటి గురించి ఎక్కువగా మాట్లాడటం మంచిది కాదని అంటూనే.. ఆ దాడిని ‘అమేజింగ్ ఎటాక్’ అని అభివర్ణించారు. కాగా, మదురో సెక్యూరిటీ వింగ్​లో పనిచేసిన ఓ గార్డ్ చెప్పిన వివరాల ప్రకారం.. అమెరికా యూజ్ చేసిన సీక్రెట్ వెపన్​తో కలిగిన ప్రభావం చాలా భయంకరంగా ఉందన్నాడు. ‘‘అమెరికా సైనికులు ఎలాంటి కాల్పులు జరపకుండానే, ఒక రకమైన తీవ్రమైన శబ్ద తరంగాలను ప్రయోగించారు. ఆ శబ్ద తరంగాల ధాటికి మా ముక్కుల నుంచి రక్తం కారడం మొదలైంది. చాలామందికి వాంతులు అయ్యాయి. మరికొందరు తల లోపల పేలిపోతున్నట్లుగా అనిపించింది. కేవలం 20 మంది అమెరికా సైనికులే వచ్చారు. మేము వేల సంఖ్యలో ఉన్నాం. అందరినీ కొద్ది నిమిషాల్లోనే అచేతనంగా మార్చేశారు. అధ్యక్షుడు, ఆయన భార్యను బంధీగా చేసుకుని వెళ్లిపోయా రు’’అని వెనెజువెలా గార్డ్ చెప్పాడు.