ఆదివారం నుంచి బంగ్లాతో వన్డే సిరీస్ స్టార్ట్

ఆదివారం నుంచి బంగ్లాతో వన్డే సిరీస్ స్టార్ట్

టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్తో టీ20, వన్డే సిరీస్ ఆడిన టీమిండియా తర్వాత బంగ్లాదేశ్తో వన్డే, టెస్టు సిరీస్లలో పాల్గొననుంది. ఇందులో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్ బయలుదేరి వెళ్లింది. డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 26 వరకు భారత్ బంగ్లాలో పర్యటించనుంది. ఇందులో భాగంగా  మొత్తం మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. 

వన్డే సిరీస్..

మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ డిసెంబర్ 4న ఆదివారం ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ డిసెంబర్ 7న, మూడో వన్డే డిసెంబర్ 10న జరగనుంది. ఈ మూడు మ్యాచులకు షేర్ ఏ బంగ్లా స్టేడియం వేదిక కానుంది. 

టెస్టు సిరీస్..

రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్లో భాగంగా  ఫస్ట్ టెస్టు డిసెంబర్ 14న మొదలు కానుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు చిట్టగాంగ్లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో తొలి టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత రెండో టెస్టు డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఢాకాలో జరగనుంది. 

సీనియర్ల రాక..

ఈ సిరీస్కు సీనియర్లు కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండనున్నారు. కివీస్తో జరిగిన టీ20, వన్డే సిరీస్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్లకు విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు బంగ్లా టూర్కు  సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. తొలిసారి ఎన్నికైన యశ్ దయాల్, రజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠి వంటి కుర్రాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ సిరీస్ మంచి అవకాశం కానుంది.  

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్,  కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి,పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్, దీపక్ చాహర్, యశ్ దయాల్.

భారత టెస్టు జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), KL రాహుల్, గిల్, పుజారా, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, పంత్ (వికెట్ కీపర్), KS భరత్ (వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, షమీ,  సిరాజ్, ఉమేశ్ యాదవ్.