గోధుమల ఎగుమతిపై కేంద్రం నిషేధం

గోధుమల ఎగుమతిపై కేంద్రం నిషేధం

గోధుమల ఎగుమ‌తిపై కేంద్ర ప్ర‌భుత్వం నిషేధం విధించింది. త‌క్ష‌ణ‌మే ఈ నిషేధం అమ‌లులోకి రానున్నట్లు తెలిపింది. దేశంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. శుక్ర‌వారం వ‌ర‌కు ఎగుమ‌తి కోసం క్రెడిట్ లెట‌ర్ జారీ చేసిన వాటికి మాత్ర‌మే షిప్పింగ్‌కు అనుమ‌తి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఉక్రెయిన్ నుండి వెళ్లాల్సిన గోధుమలను యుద్ధం నేపథ్యంలో  రష్యా అడ్డుకుంటుంది. దీంతో అనేక దేశాల‌కు గోధుమల స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాలు గోధుమ ఎగుమ‌తుల్లో టాప్ ప్లేస్‌లో ఉంటాయి. అయితే ఈ రెండు దేశాలు యుద్ధం చేస్తుండడంతో గోధుమ‌ల‌కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్ గోధుమలపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది.