
- 2024-25 లో రూ.2 లక్షల కోట్లకు చేరుకున్న ఎగుమతులు
న్యూఢిల్లీ: కేవలం పదేళ్లలోపే మూడో అతిపెద్ద మొబైల్ ఫోన్ల ఎగుమతి దేశంగా ఇండియా ఎదగగలిగింది. 2014 లో దిగుమతులపై ఆధారపడిన ఇండియా, 2024–25 లో 24.1 బిలియన్ డాలర్ల (రూ. 2 లక్షల కోట్ల) విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్ (సీడీసీ) రిపోర్ట్ ప్రకారం, ఎగుమతులు పెరగడంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ సాయపడింది.
అలానే గ్లోబల్‌గా సప్లయ్ చెయిన్‌లో మార్పులు రావడం కలిసొచ్చింది. 2017-–18లో జరిపిన 2 మిలియన్ డాలర్ల (రూ.17.20 కోట్ల) ఎగుమతులతో పోలిస్తే 2024–25 లో సాధించిన 24.1 బిలియన్ డాలర్ల ఎగుమతులు ఏకంగా 11,950శాతం ఎక్కువ. 2018–-19 నుంచి మొబైల్ ఫోన్‌లలో ఎగుమతుల్లో మిగులు నమోదవుతోంది. డొమెస్టిక్ వాల్యూ ఆడిషన్ (డీవీఏ) 2022–-23లో 10 బిలియన్ డాలర్లను దాటింది.
సీడీఎస్ రిపోర్ట్ ప్రకారం, మొబైల్ ఫోన్ సెక్టార్ 2022–-23 నాటికి 17 లక్షల మందికి ఉపాధి కల్పించింది. ఎగుమతి సంబంధిత ఉద్యోగాలు 33 రెట్లు పెరిగాయి. వేతనాలు, ముఖ్యంగా ఎక్స్‌పోర్ట్స్ సెగ్మెంట్‌లో బాగా పెరిగాయి. గ్లోబల్ వాల్యూ చైన్‌లో మార్పులు రావడంతో లోకల్ డీవీఏ , ఉద్యోగాలు పెరిగాయని ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మోహింద్రూ అన్నారు.