గాజు మేడల్లో..ప్రకృతి ఆతిథ్యం!

గాజు మేడల్లో..ప్రకృతి ఆతిథ్యం!

ఎటువంటి రణగొణ ధ్వనులు లేకుండా నేచర్​ మధ్యలో కూర్చుని ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ , మూన్​లైట్​ డిన్నర్​ చేస్తే... భలే ఉంటుంది. కానీ అంత ప్రశాంతమైన ప్లేస్​ ఎక్కడ అంటున్నారా? ‘గ్లాస్​హౌస్​’ హోటల్స్​లో ఉంటే ఆ అనుభూతిని పొందొచ్చు. ఇండియాలో ఇలాంటి ఫేమస్​ అయిన హోటల్స్​ కొన్ని ఉన్నాయి. అక్కడ ఉంటే ప్రకృతి ఒడిలోకి వెళ్లినట్లే అనిపిస్తుంది. అవి​ ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలిస్తే ఒకసారి వెళ్లి చూడొచ్చు! 

ఫారెస్ట్ హిల్స్​

మహారాష్ట్రలోని తల అనే ప్లేస్​లో రిసార్ట్​ ఫీచర్స్​తో ఉన్న గ్లాస్​ హౌస్​ ఉంది. అక్కడ గాజు గోడల నుంచి వ్యాలీ అందాలు చూస్తుంటే మైమరిచిపోవాల్సిందే. రెండు అంతస్తుల బిల్డింగ్​లో  ప్రతి రూమ్​కు బాల్కనీ ఉంది. ఇంటి బయట బాత్​టబ్​ ఉంటుంది. 

గ్లాస్​హౌజ్​ సెలెస్టె

ఉత్తరాఖండ్​​లోని రాణీఖేత్​లో త్రీ బెడ్​రూమ్​ విల్లా ఉంది. ఈ విల్లాలో పొడవుగా ఉండే గ్లాస్​ కిటికీల నుంచి వ్యాలీని 360 డిగ్రీల్లో చూడొచ్చు. హిమాలయాలు కనిపిస్తాయి. ఒక కిటికీ నుంచి సూర్యోదయం పలకరిస్తే మిగతా రెండు కిటికీల నుంచి సూర్యాస్తమయాలు వీడ్కోలు చెప్తుంటాయి. టెలిస్కోప్​ కూడా ఉంటుంది.  

గ్లాస్​హౌస్​ ఆన్​ దిబే

గోవాలోని చపరాలో ఉన్న దిబేలో నీటి అంచున కూర్చుని నీటి అలల మీద పడుతున్న సూర్య కిరణాల దోబూచులాటను ఎంజాయ్​ చేయొచ్చు. ఈ హౌస్​ అంతా గ్లాస్​తో ఉండనప్పటికీ వాటర్​ ఫ్రంట్​ విల్లా నుంచి సముద్రం చూడడం బాగుంటుంది. కామన్​ ఏరియాను గ్లాస్​ వాల్స్​తో కట్టడం వల్ల చూడటానికి గ్లాస్​ హౌస్​ లా అనిపిస్తుంది.  

ప్రైమ్​రోజ్​ విల్లాస్​

కర్నాటకలోని చిక్కమగళూరుకి వెళ్లాలంటే బెంగళూరు నుంచి నాలుగు గంటల డ్రైవ్​. ఇక్కడ ప్రైమ్​రోజ్​ విల్లా ఉంది. ఈ విల్లాలో బెడ్​రూమ్స్​, డైనింగ్​ స్పేస్​ నుంచి బాత్​టబ్​ వరకు ఎక్కడి నుంచి చూసినా పర్వతాలు పలకరిస్తాయి.

శక్తి 360 లెటి

ఉత్తరాఖండ్​లోని బాగేశ్వర్​లో సముద్రానికి ఎనిమిది వేల అడుగుల ఎత్తున ఉంది. కావాల్సినవి ప్యాక్​​ చేసుకుని కొంతదూరంలో ఉన్న నదికి వెళ్లి ఫిషింగ్​ చేయొచ్చు. ఇంటికి మూడు వైపులా ప్యానెల్​డ్​​ గ్లాస్​ వాల్స్​ ఉంటాయి. మూడు బెడ్​రూమ్​ల నుంచి హిమాలయాలు కనిపిస్తాయి. శీతాకాలంలో ఈ స్టే అందుబాటులో ఉండదు. 

 ది తారా హౌస్​

హిమాచల్ ప్రదేశ్​లోని, మనాలిలో  హిల్​టాప్​ మీద ఉన్న రెండు బెడ్​రూమ్​ల బొటిక్​ లాడ్జ్​ ఇది. మనాలి సిటీ సెంటర్ ​నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాత్రుళ్లు నక్షత్రాల​ కాన్వాస్​గా మారిపోతుంది ఈ గ్లాస్​హౌస్​. ఇక్కడ స్టే చేసిన వాళ్లకు మంచుతో కప్పుకున్న పర్వతశిఖరాలు వెల్​కం చెప్తాయి. 

ది గ్లాస్​హౌస్​

మహారాష్ట్రలోని పంచ్​గనిలో స్టే చేసేందుకు సింగిల్​ బెడ్​రూమ్​ సెలక్ట్​ చేసుకోవడం బెటర్​. దాని పక్కనే నాలుగు బెడ్​రూమ్​ల ఇటుక విల్లా కాంప్లెక్స్​ కూడా ఉంటుంది. ఈ రెండిటిని కలిపి లేదా విడిగా కూడా బుక్​ చేసుకోవచ్చు. గ్లాస్​హౌస్​ గోడలు ఫ్రెంచ్​ విండోస్​తో ఉంటాయి.

ది గ్లాస్​స్కేప్​

మహారాష్ట్రలోని నాసిక్​లో ఉంటుంది ది గ్లాస్​స్కేప్​. మూడు వైపులా గాజు గోడలతో అవుట్​డోర్​, ఇండోర్స్​ కలిసిపోయినట్టే ఉంటాయి. టు బెడ్​రూమ్స్​ ఉన్న ఈ ఇంటిలో ఏ మూల నుంచి చూసినా ప్రకృతి అందాలే కనిపిస్తాయి. ప్రైవేట్​ స్విమ్మింగ్​ పూల్​కి గెస్ట్​లు వెళ్లొచ్చు. అలాగే ఇండోర్​ గేమ్స్​ కూడా ఆడుకోవచ్చు. అదనంగా డబ్బు కడితే బార్బెక్యు పిట్ వాడుకోవచ్చు. చలిమంట కాచుకోవచ్చు.