అండర్ వాటర్ ఫ్లాగ్ డెమో నిర్వహించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

అండర్ వాటర్ ఫ్లాగ్ డెమో నిర్వహించిన  ఇండియన్ కోస్ట్ గార్డ్

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కేంద్రం ఇటీవల తలపెట్టిన హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా జాతీయ జెండా గొప్పతనాన్ని చాటేందుకు ఓ కోస్ట్ గార్డ్ చేసిన ప్రయత్నం ప్రజల్లో దేశభక్తిని తట్టిలేపేదిగా ఉంది. 3 రోజులు ప్రతీ ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలన్న ప్రధాని మోడీ పిలుపు మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్  సముద్రం లోపల ఫ్లాగ్ డెమో నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా చేపట్టిన ఈ క్యాంపెయిన్ పై అందరికీ అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఈ పని చేసినట్టు తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుకతోంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఇండియన్ కోస్ట్ గార్డు సముద్రంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దేశం మొత్తాన్నీ కదిలించే విధంగా ఉన్న ఈ అండర్ వాటర్ ఫ్లాగ్ డెమో ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. మామూలుగా భూమ్మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం అందరికీ తెలిసిన ప్రక్రియే. కానీ ఈ సారి ప్రత్యేకంగా సముద్రపు నీటిలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుండడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.