
డబ్లిన్ (ఐర్లాండ్): వరుస విజయాలతో దూకుడు కనబర్చిన ఇండియా జూనియర్ మహిళల జట్టు.. నాలుగు దేశాల అండర్–21 హాకీ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం స్కాట్లాండ్‌తో జరిగిన ఆఖరిలీగ్ మ్యాచ్‌లో 2–1తో విజయం సాధించింది. ఇండియా ప్లేయర్లు ముంతాజ్ ఖాన్ (36వ ని.), గగన్‌దీప్ కౌర్ (51వ ని.) గోల్స్ చేయగా.. స్కాట్లాండ్‌తరపున మార్గరీ జెస్టిస్ (50వ ని.) ఏకైక గోల్ నమోదు చేసింది. తొలిరెండు క్వార్టర్లపాటు ఇరుజట్లు హోరాహోరీగా పోరాడిన గోల్స్ నమోదు కాలేదు. మూడో క్వార్టర్లో ముంతాజ్ గోల్ చేయడంతో ఇండియా ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక నాలుగో క్వార్టర్ ప్రారంభంలో గోల్‌తో స్కోరును 1–1తో స్కాట్లాండ్ సమం చేసింది. అయితే తర్వాతి నిమిషంలోనే పెనాల్టీని గోల్‌గా మలిచిన గగన్‌దీప్‌కౌర్ జట్టును మరోసారి ఆధిక్యంలో నిలిపింది. చివరివరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న ఇండియా గెలిచింది