మరో వారం రోజులు తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

మరో వారం రోజులు తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

మరో వారం రోజులు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాల కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య బంగాళాఖాతం లో కొనసాగుతున్న ద్రోణి.. ఉత్తర అంతర్గత పరిసర ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంలో మార్పులకోసం ఇవాళ(ఆదివారం ఆగస్టు10), సోమవారం,మంగళవారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం తెలంగాణలోని ఏడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.  

ఆదివారం తెలంగాణలోని ఏడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.  ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో పలు చోట్లు వర్షం కురిసే అవకాశం ఉంది. 

రేపు కూడా 11 జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రం భీం అసిఫాబాద్ , సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం.

గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఆగస్టు 13న  వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్ప పీడన ప్రభావంతో 13నుంచి 16 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేఅవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

భారీ వర్షాల ఛాన్స్ ఉన్నందున హైదరాబాద్ సిటీకి అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.  భారీ అతి భారీ  వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు.