భార్య చేతిలో కమెడియన్ కు అవమానం.. చీపురుతో కొట్టడంతో ఆత్మహత్య

భార్య చేతిలో కమెడియన్ కు అవమానం.. చీపురుతో కొట్టడంతో ఆత్మహత్య

కర్ణాటకకు చెందిన ప్రముఖ కమెడియన్ చంద్రశేఖర్ సిద్ధి ఆత్మహత్య కేసులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ఆత్మహత్యకు ప్రధాన కారణం భార్య చేతిలో అవమానానికి గురికావడమేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉత్తర కర్ణాటకలోని సిద్ధి తెగకు చెందిన చంద్రశేఖర్ 'కామెడీ కిలాడిగలు' రియాల్టీ షోతో ఎంతో పాపులర్ అయ్యారు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

అవకాశాలు లేక డిప్రెషన్
నటనపై అపారమైన ప్రేమ ఉన్న చంద్రశేఖర్, కొన్ని సీరియల్స్‌లో నటించిన తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆయన ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. జీవనోపాధి కోసం తన స్వగ్రామానికి తిరిగి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవితం గడిపారు. ఈ పరిస్థితితో ఆయన తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లారని పోలీసులు తెలిపారు.

ALSO READ : టాలీవుడ్ సంక్షోభం..

భార్య చేతిలో అవమానం.. 
జూలై 31న, చంద్రశేఖర్, ఆయన భార్య మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. ఈ గొడవలో ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన భార్య చీపురుతో కొట్టింది. భార్య చేతిలో జరిగిన ఈ అవమానం చంద్రశేఖర్‌ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. అదే రోజు రాత్రి, ఆయన తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.