హైదరాబాదులో ఆకాశానికి ఇంటి ఫ్లాట్ ధరలు.. రేట్ల ర్యాలీకి అసలు కారణం NRIల డబ్బేనా..?

హైదరాబాదులో ఆకాశానికి ఇంటి ఫ్లాట్ ధరలు.. రేట్ల ర్యాలీకి అసలు కారణం NRIల డబ్బేనా..?

దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ప్రజల ఇక్కట్లు పెరిగిపోతున్నాయి. ముంబై, దిల్లీ, పూణే, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల రేట్లు రికార్డు స్థాయిలకు చేరుకోవటం ఆందోళనలు పెంచుతోంది. ప్రజల ఆదాయాల కంటే వేగంగా ఇవి పెరగటం సొంతి ఇల్లు అనేది కలల కోటగానే మిగిలిపోయేలా చేస్తోంది. 

తాజాగా ఒక వ్యక్తి తన రెడిట్ పోస్టులో గురుగ్రామ్ ప్రాంతంలో విపరీతంగా పెరిగిన రియల్టీ రేట్లతో పాటు భారతీయ నగరాల్లో రియల్ బూమ్ పై ఆందోళనలు వ్యక్తం చేశాడు. ప్రధానంగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తిరిగి రావటం, వారి ఆదాయాన్ని ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేయటం దీనికి అసలు కారణం అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్న ఎన్ఆర్ఐలు అలాగే చాలా ఏళ్లుగా అమెరికాలో సంపాదించి డబ్బును దాచుకున్న వ్యక్తులు ఇండియన్ మెట్రో సిటీస్ లో పెట్టుబడి పెట్టడం ధరలు పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. 

ప్రధానంగా అమెరికాలో వీసాల తిరస్కరణలు, టెక్ లేఆఫ్స్ వంటి కారణాలతో తిరిగి వచ్చేస్తున్న భారతీయులు తమ సేవింగ్స్ రియల్ ఎస్టేట్ లో పార్క్ చేస్తున్నారని రెడిట్ యూజర్ అన్నారు. దీంతో గురుగ్రాము, బెంగళూరు లాంటి నగరాల్లో స్థానిక ప్రజలకు కూడా కష్టాలు పెరిగాయని అన్నాడు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ జాబ్ మార్కెట్ తో పాటు రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా హీటెక్కుతోందని దీనికి కారణం యూఎస్ నుంచి రిటర్న్ వస్తున్న ఎస్ఆర్ఐ లని ఆరోపించాడు. చాలా మంది ఇక్కడ ఇంటి కొనుగోలుకోసం అమెరికాలో వీలైనన్ని రోజులు ఉండేందుకు చూస్తున్నట్లు చెప్పాడతను. 

ALSO READ : 2 నిమిషాల్లో రూ.300 కోట్లు నష్టపోయిన జున్‌జున్‌వాలా ఫ్యామిలీ..

ఇంటి ధరలు పేరుగుతున్నప్పటికీ ఇంటి అద్దెలు ఆ స్థాయిలో పెరగకపోయినా మధ్యతరగతి భరించలేని స్థాయిల్లోనే ప్రస్తుతం కొనసాగుతున్నాయన్నారు. పెద్ద నగరాల్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, బిల్డర్లు అధిక ధరల నుంచి లాభంపొందుతున్నారని సామాన్యుల కలలను ఇవి చిదిమేస్తున్నాయని రెడిట్ యూజర్ ఆరోపించారు. ఇక పెద్ద కంపెనీల్లో లక్షల్లో వేతనాలు పొందుతున్న వ్యక్తుల కారణంగా గేటెడ్ కమ్యూనిటీలకు , లగ్జరీ నివాసాలకు డిమాండ్ పెరగటంతో తక్కువ బడ్జెట్ ఇళ్ల నిర్మాణం తగ్గిపోయింది. ఇక బెంగళూరు లాంటి నగరాల్లో గడచిన రెండేళ్లలో ఇంటి అద్దెలు దాదాపు డబుల్ అయ్యాయి. కనీసం రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల ప్యాకేజీ ఉంటేనే బెంగళూరు లాంటి నగరాల్లో బతకగలిగే పరిస్థితులు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. 

మార్కెట్లో డిమాండ్ కి అనుగుణంగా సప్లై పెరగకపోతే ధరలు ఆకాశం నుంచి కిందికి రావని దీంతో ఒక జనరేషన్ మెుత్తం సొంతింటి కలకు దూరం అయ్యే ప్రమాదం ఉందని రియల్టీ నిపుణులు చెబుతున్నారు.