నార్త్ కొరియా మిసైల్ టెస్టులను ఖండించిన ఇండియా

నార్త్ కొరియా మిసైల్ టెస్టులను ఖండించిన ఇండియా

న్యూయార్క్: ఉత్తర కొరియా చేపట్టిన ఇంటర్​కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని మన దేశం ఖండించింది. న్యూక్లియర్, మిసైల్ టెక్నాలజీ విస్తరించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. యునైటెడ్ నేషన్స్​లో మంగళవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో ఇండియా శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడారు.

ఇలాంటి వెపన్స్ ప్రపంచ దేశాల శాంతిభద్రతలకే ప్రమాదమని అన్నారు. కొరియా దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు, డీన్యూక్లియరైజేషన్​కు ఇండియా మద్దతు ఇస్తుందని చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు, భద్రతా మండలి కలసికట్టుగా ఉండాలని ఆమె కోరారు. ఇటీవల ఉత్తర కొరియా మిసైల్ టెస్ట్ చేయగా.. ఆ దేశ ప్రెసిడెంట్ కిమ్‌‌ భార్య, కూతురుతో కలిసి శక్తిమంతమైన ఇంటర్​కాంటినెంటల్ మిసైల్‌‌ టెస్ట్‌‌ను పరిశీలించారు. శత్రువుల బెదిరింపులు కొనసాగితే న్యూక్లియర్ వెపన్స్ తో సమాధానం ఇస్తామని కిమ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే యూఎన్​లో భద్రతా మండలి రెండోసారి సమావేశమైంది.