ఆసియా క్రీడలు: స్క్వాష్లో కాంస్యాలతో సరిపెట్టుకున్న ఇండియా

ఆసియా క్రీడలు: స్క్వాష్లో కాంస్యాలతో సరిపెట్టుకున్న ఇండియా

ఆసియా క్రీడల్లో ఇండియా స్క్వాష్‌‌ జట్లు కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నాయి. గురువారం జరిగిన విమెన్స్‌‌ సెమీస్‌‌లో ఇండియా 1–2తో హాంకాంగ్‌‌ చేతిలో ఓడింది. విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో అనహత్‌‌ సింగ్‌‌ 11–9, 11–8, 6–11, 11–13, 10–12తో సిన్‌‌ యుక్‌‌ చాన్‌‌ చేతిలో ఓడిపోవడం ఇండియా పతకం ఆశలను దెబ్బతీసింది. మరో మ్యాచ్‌‌లో తన్వీ శర్మ 4–11, 13–11, 11–9, 13–11తో కాయీ లీపై గెలిచి ఇండియాను రేసులోకి తెచ్చింది.

అయితే కీలకమైన మ్యాచ్‌‌లో జోష్నా చిన్నప్ప 4–11, 7–11, 9–11తో హో జి లోక్‌‌ చేతిలో పరాజయం పాలైంది. మెన్స్‌‌ సెమీస్‌‌లో ఇండియా 1–2తో మలేసియా చేతిలో కంగుతిన్నది. వీర్‌‌ చోత్రాని 11–4, 11–8, 11–5తో సంజయ్‌‌ జీవాపై గెలవగా, అభయ్‌‌ సింగ్‌‌ 8–11, 8–11, 8–11తో యో చేతిలో, సెంథిల్‌‌ కుమార్‌‌ 12–10, 6–11, 8–11, 9–11తో చందరన్‌‌ చేతిలో ఓడారు. ఓవరాల్‌‌గా ఇండియా రెండు రజతాలు, మూడు కాంస్యాలతో టోర్నీని ముగించింది.