నేడు శ్రీలంకతో ఇండియా తొలి టీ20

నేడు శ్రీలంకతో ఇండియా తొలి టీ20
  • గాయంతో సూర్యకుమార్‌‌ ఔట్‌‌
  • రా. 7 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో

లక్నో: టీ20 వరల్డ్‌‌కప్‌‌ ప్రిపరేషన్స్‌‌లో ఉన్న టీమిండియా ఇంకో సిరీస్‌‌పై కన్నేయడంతో పాటు యంగ్‌‌స్టర్స్‌‌కు మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకు రెడీ అయింది. వెస్టిండీస్‌‌తో మూడేసి వన్డేలు, టీ20ల సిరీస్‌‌లను క్లీన్‌‌స్వీప్‌‌ చేసిన రోహిత్‌‌సేన ఇప్పుడు శ్రీలంకపై కూడా అదే రిజల్ట్‌‌ను రిపీట్‌‌ చేయాలని చూస్తోంది. అదే టైమ్‌‌లో టీ20 వరల్డ్ కప్‌‌ టీమ్‌‌లో ప్లేస్‌‌ ఆశిస్తున్న కుర్రాళ్ల టాలెంట్‌‌నూ టెస్ట్‌‌ చేయనుంది. ఈ క్రమంలో  మూడు టీ20ల సిరీస్‌‌లో భాగంగా ఇక్కడి ఎకానా స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌‌లో టీమిండియానే ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లీ, కేఎల్‌‌ రాహుల్‌‌, రిషబ్‌‌ పంత్‌‌ ఈ సిరీస్‌‌కు రెస్ట్‌‌ తీసుకోగా.. గాయాల వల్ల పేసర్‌‌ దీపక్‌‌ చహర్‌‌తో పాటు ఇన్‌‌ఫామ్ బ్యాటర్‌‌ సూర్యకుమార్‌‌ దూరమయ్యారు. అయినా,  స్టార్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా, ఆల్‌‌రౌండర్‌‌ రవీంద్ర జడేజా రీఎంట్రీతో మన టీమ్‌‌ స్ట్రాంగ్‌‌గా కనిపిస్తోంది. కాబట్టి విండీస్‌‌ మాదిరిగా లంకతో కూడా వన్‌‌సైడ్‌‌ రిజల్ట్‌‌లే ఆశించొచ్చు. కానీ, రిజల్ట్‌‌ కంటే ముఖ్యంగా వరల్డ్‌‌కప్‌‌లో బరిలోకి దిగే అవకాశం ఉన్న ప్లేయర్లకు  వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌‌లు ఆడే అవకాశం ఇవ్వాలని మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తోంది. దాంతో, యంగ్​స్టర్స్​పైనే అందరి ఫోకస్​ ఉండనుంది.

శాంసన్‌‌ రిటర్న్‌‌!
కోహ్లీ,  రాహుల్‌‌,  పంత్‌‌ , సూర్య లేకపోవడంతో ఇషాన్‌‌, రుతురాజ్‌‌, సంజూ శాంసన్‌‌కు అవకాశం రానుంది. కోహ్లీ ఆబ్సెంట్‌‌లో ఫైనల్‌‌ టీమ్‌‌లో ప్లేస్‌‌ గ్యారెంటీ అయినప్పటికీ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ రిలాక్స్‌‌ అవ్వడానికి లేదు. మిడిలార్డర్‌‌లో పోటీ ఎక్కువైన నేపథ్యంలో ఆడిన ప్రతీ మ్యాచ్‌‌లో రన్స్‌‌ చేసి తను రేసులో ముందుండాల్సిందే. వెస్టిండీస్​తో సిరీస్​లో వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ ఫినిషర్​గా మంచి పేరు తెచ్చుకున్నాడు.  ఇప్పుడు గాయాల కారణంగా పేసర్‌‌ దీపక్‌‌ చహర్‌‌, సూర్యకుమార్‌‌ ఈ సిరీస్‌‌కు దూరమైన నేపథ్యంలో ఆల్‌‌రౌండర్‌‌, ఫినిషర్‌‌గా అతనిపై మరింత బాధ్యత ఉండనుంది. ఇక, ఈ సిరీస్‌‌కు ఎంపికైన కీపర్‌‌ సంజూ శాంసన్‌‌ సూపర్‌‌ టాలెంటెడ్‌‌ ప్లేయర్‌‌ అంటూ కెప్టెన్‌‌ రోహిత్‌‌ పొగిడాడు. కాబట్టి తొలి మ్యాచ్‌‌ నుంచే తను బరిలోకి దిగే చాన్సుంది.  నేషనల్‌‌ టీమ్‌‌లోకి వచ్చిపోతున్న శాంసన్ ఈ చాన్స్‌‌ను సద్వినియోగం చేసుకుంటే అతని కెరీర్‌‌కు హెల్ప్‌‌ అవుతుంది. ఇక, విండీస్‌‌పై టీ20ల్లో రాణించినయంగ్​ స్పిన్నర్‌‌ రవి బిష్ణోయ్‌‌ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న స్పిన్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ జడేజా రీఎంట్రీతో స్పిన్‌‌తో పాటు మిడిలార్డర్‌‌ కూడా స్ట్రాంగ్‌‌ అవుతుంది. ఇక, సౌతాఫ్రికా టూర్‌‌ తర్వాత  రెస్ట్ తీసుకొని తిరిగొచ్చిన స్పీడ్‌‌స్టర్‌‌ బుమ్రా పేస్​ బౌలింగ్‌‌ను నడిపించనున్నాడు. అతనికి తోడు సీనియర్‌‌ పేసర్​ భువనేశ్వర్‌‌, హైదరాబాదీ మహ్మద్​ సిరాజ్‌‌ పేస్‌‌ బాధ్యతలు పంచుకుంటారు.

లంక పోటీ ఇచ్చేనా
పేరుకు పెద్ద జట్టే అయినా శ్రీలంక ఆ స్థాయిలో ఆడటం లేదు. సీనియర్ల రిటైర్మెంట్‌‌ తర్వాత లంక డీలా పడ్డది. రీసెంట్‌‌గా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌‌లో 0–4తో  ఓడింది. ముఖ్యంగా బ్యాటింగ్‌‌ ఫెయిల్యూర్‌‌ లంకను ఇబ్బంది పెడుతోంది. అయితే, ఇప్పుడు ఉపఖండంలో పోటీ కాబట్టి  ఇండియాపై తమ బ్యాటర్లు బాగా ఆడాలని కెప్టెన్‌‌ దసున్ షనక ఆశిస్తున్నాడు. అలాగే, కరోనా నుంచి ఇంకా కోలుకోని స్టార్‌‌ లెగ్‌‌ స్పిన్నర్‌‌ వానిందు హసరంగ దూరం అవడంతో లంక బౌలింగ్‌‌ కూడా కాస్త వీక్‌‌ అయింది. మరి, జోరు మీదున్న ఇండియాకు లంక ఏమేరకు పోటీ ఇస్తుందో చూడాలి. 

టీమ్స్‌‌ (అంచనా)
ఇండియా: రోహిత్‌‌ (కెప్టెన్‌‌), రుతురాజ్‌‌, ఇషాన్‌‌ (కీపర్), శ్రేయస్‌‌, శాంసన్‌‌,  వెంకటేశ్‌‌, జడేజా, సిరాజ్‌‌/హర్షల్‌‌, భువనేశ్వర్‌‌, బుమ్రా, బిష్ణోయ్‌‌.
శ్రీలంక: నిసాంక, గుణతిలక, కమిల్‌‌ మిశార (కీపర్‌‌), చండిమల్‌‌, చరిత్‌‌ అసలంక, షనక (కెప్టెన్‌‌), చమిక కరుణరత్నె, వాండర్‌‌సే, జయవిక్రమ, దుష్మంత చమీర, లాహిరు కుమార.