వైజాగ్ వన్డే మనదే: విండీస్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ

వైజాగ్ వన్డే మనదే: విండీస్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ

వైజాగ్: విండీస్ తో జరిగిన సెకండ్ వన్డేలో గ్రాండ్ విక్టరీ సాధించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది టీమిండియా. 107రన్స్ తేడాతో గెలిచి 3 వన్డేల సిరీస్ ను 1-1తో సమం చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఓపెనర్లు రోహిత్, రాహుల్ సెంచరీలతో చెలరేగగా..శ్రేయాస్, పంత్ రెచ్చిపోయి ఆడారు. చివర్లో జాదవ్ కూడా రాణించడంతో భారత్ బిగ్ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 స్కోర్ చేసింది.

388 టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ మొదట్లో బాగానే ఆడింది. ఆ తర్వాత స్పిన్నర్ల మాయాజాలానికి టపటప వికెట్లు కోల్పోయింది. 43 ఓవర్లకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ హైట్రిక్ తో మ్యాచ్ ను వన్ సైడ్ చేశాడు. చిచ్చర పిడుగు హెట్ మెయిర్ (4) తక్కువ స్కోర్ కే ఔట్ కావడంతో ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు వరుసగా పెవిలియన్ కు చేరారు. విండీస్ ప్లేయర్లలో హోప్(78), నికోలస్ పూరణ్(75), లివీస్(30), కీమోపౌల్(46) తప్ప మిగతా ప్లేయర్లు రాణించలేక పోయారు.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3), షమీ(3), జడేజా(2), ఠాకూర్(1) వికెట్లు తీశారు.