కొలంబో: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్న శ్రీలంకకు భారత్ సాయం అందించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), లంక ఐఓసీ (ఎల్‌ఐఓసీ) స్థానిక కార్యకలాపాల ద్వారా అత్యవసర సాయంగా 20 వేల మెట్రిక్ టన్నుల డీజిల్, 18 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ పంపించగా శనివారం కొలంబోకు చేరుకుంది. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే సోషల్ మీడియా వేదికగా ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
