
జోహర్ బహ్రు(మలేసియా): సుల్తాన్ జోహర్ కప్‌లో ఇండియా జూనియర్ హాకీ టీమ్ బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 3–2తో గ్రేట్ బ్రిటన్‌పై గెలిచింది. ఇండియా తరఫున రోహిత్ (45, 52వ ని), రవ్నీత్ సింగ్ (23వ ని) గోల్స్ చేయగా, మైకేల్ రోడెన్ (26వ ని), కాడెన్ డ్రైసే (46వ ని) బ్రిటన్‌కు గోల్స్ అందించారు.
తొలి క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్స్ కోసం హోరాహోరీగా పోరాడినా ప్రయోజనం దక్కలేదు. కానీ రెండో క్వార్టర్‌లో దాడుల పదును పెరగడంతో రెండు గోల్స్ నమోదయ్యాయి. ఫస్ట్ హాఫ్‌లో ఇండియా పదిసార్లు సర్కిల్‌లోకి దూసుకెళ్లినా గోల్స్ చేసే చాన్స్‌ను రాబట్టలేకపోయింది.
మూడో క్వార్టర్‌లో ఇరుజట్లు షార్ట్ పాస్‌లతో బంతిపై ఆధిపత్యం కోసం పోరాడాయి. మ్యాచ్ చివర్లో మూడు నిమిషాల వ్యవధిలో ఇండియాకు మూడు పెనాల్టీలు లభించాయి. మూడోది గోల్‌గా మల్చారు.