ఉప్పల్ స్టేడియంలో భారత్- బంగ్లాదేశ్‌ మ్యాచ్.. 2024-25 సీజన్ షెడ్యూల్ విడుదల

ఉప్పల్ స్టేడియంలో భారత్- బంగ్లాదేశ్‌ మ్యాచ్.. 2024-25 సీజన్ షెడ్యూల్ విడుదల

2024-25 సీజన్‌కు సంబంధించి స్వదేశంలో జరగనున్న టీమిండియా మ్యాచ్‍ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం(జూన్ 20) విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో హోమ్ సీజన్ ప్రారంభమవుతుంది.

సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 12 వరకు బంగ్లా జట్టు.. భారత్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో ఇరు జట్ల మధ్య 2 టెస్టులు, 3 టీ20లు జరగనున్నాయి. తొలి టెస్టుకు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుండగా.. రెండో టెస్టు కాన్పూర్‌లో జరగనుంది. అనంతరం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు ధర్మశాల, ఢిల్లీ, హైదరాబాద్‌ వేదికగా జరగనున్నాయి.

న్యూజిలాండ్‌‌తో టెస్ట్ సిరీస్

అక్టోబరు 16 నుంచి న్యూజిలాండ్‌ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి టెస్టు  బెంగుళూరులో, రెండో టెస్టు పూణేలో, చివరి టెస్టు ముంబైలో జరగనుంది.

ఇంగ్లండ్‌ పర్యటన

కొత్త ఏడాది ప్రారంభంలో భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య సుదీర్ఘ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ  ఇరు జట్ల ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనున్నాయి. టీ20 సిరీస్‌కు చెన్నై, కోల్‌కతా, రాజ్‌కోట్, పుణె, ముంబై ఆతిథ్యం ఇవ్వనుండగా.. వన్డేలకు నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

2024-25 హోమ్ సీజన్ టీమిండియా షెడ్యూల్

బంగ్లాదేశ్‌తో

 • మొదటి టెస్టు (సెప్టెంబర్ 19 - 23): చెన్నై
 • రెండో టెస్టు (సెప్టెంబర్ 27- అక్టోబర్ 1): కాన్పూర్
 • మొదటి టీ20 (అక్టోబర్ 6): ధర్మశాల
 • రెండో టీ20 (అక్టోబర్ 9): ఢిల్లీ
 • మూడో టీ20 (అక్టోబర్ 12): హైదరాబాద్

న్యూజిలాండ్‌తో

 • మొదటి టెస్టు (అక్టోబర్ 16 - 20): బెంగళూరు
 • రెండో టెస్టు (అక్టోబర్ 24 - 28): పూణే
 • మూడో టెస్టు (నవంబర్ 1- 5): ముంబై

ఇంగ్లండ్‌‌తో

 • మొదటి టీ20 (జనవరి 22): చెన్నై
 • రెండో టీ20 (జనవరి 25): కోల్‌కతా
 • మూడో టీ20 (జనవరి 28): రాజ్‌కోట్
 • నాలుగో టీ20 (జనవరి 31): పూణే
 • ఐదో టీ20 (ఫిబ్రవరి 2): ముంబై
 • మొదటి వన్డే (ఫిబ్రవరి 6): నాగపూర్
 • రెండో వన్డే (ఫిబ్రవరి 9): కటక్
 • మూడో వన్డే (ఫిబ్రవరి 12): అహ్మదాబాద్