న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ చాంపియన్ ఇండియా జూన్ చివర్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనున్నట్లు బీసీసీఐ శనివారం ప్రకటించింది. జూన్ 26, 28 తేదీల్లో ఈ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌కు ముందు ఇండియా జట్టు ఈ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్‌లు బెల్ఫాస్ట్‌లో జరగనున్నాయి. 2007 తర్వాత ఇండియా ఈ వేదికపై ఆడటం ఇదే తొలిసారి.
గతంలో మూడుసార్లు ఐర్లాండ్‌లో పర్యటించినప్పటికీ అవన్నీ డబ్లిన్ శివార్లలోని మలాహిడెలో జరిగాయి. ఈ టూర్‌కు ముందు ఇండియా జూన్ 20 వరకు అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటన ముగించుకుని, జులై 1-19 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొంటుంది.
